Scene Collection: సూర్య సీన్ కలెక్షన్ల సునామీ- 2 రోజుల్లో 81 కోట్ల కలెక్షన్స్- ఆ 2 సినిమాలు అవుట్- 200 కోట్ల టార్గెట్

Suriya Scene Box Office Collection Day 2: కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన 'సీన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు రూ. 200 కోట్ల సినిమాలతో అలరించిన సూర్య ఇప్పుడు హ్యాట్రిక్ సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. మరి సీన్ సినిమా కలెక్షన్స్‌పై ఓ లుక్కేద్దాం.

Published on: Nov 8, 2026, 11:33:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Suriya Scene 2 Days Worldwide Collection: తెలుగు, తమిళ భాషల్లో పవర్ ఫుల్ మాస్ ఇమేజ్‌తో పాటు అపారమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్న హీరో సూర్య బాక్సాఫీస్ వేట మళ్లీ మొదలైంది. ఈ ఏడాది ఇప్పటికే 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' వంటి చిత్రాలతో వరుసగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి జోరు మీదున్న ఆయన, తాజాగా 'సీన్' చిత్రంతో థియేటర్లలోకి వచ్చారు.

సూర్య సీన్ కలెక్షన్ల సునామీ- 2 రోజుల్లో 81 కోట్ల కలెక్షన్స్- ఆ 2 సినిమాలు అవుట్- 200 కోట్ల టార్గెట్
సూర్య సీన్ కలెక్షన్ల సునామీ- 2 రోజుల్లో 81 కోట్ల కలెక్షన్స్- ఆ 2 సినిమాలు అవుట్- 200 కోట్ల టార్గెట్

దివాళికి ముందే సందడి

దివాళి పండుగ సందడికి ముందే విడుదలైన ఈ సీన్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్యకు ఉన్న మంచి మార్కెట్ వల్ల తొలి రోజు నుంచే థియేటర్లు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి.

రెండు రోజుల్లోనే రూ.81 కోట్లకు పైగా గ్రాస్!

బాక్సాఫీస్ విశ్లేషణ గణాంకాల ప్రకారం.. 'సీన్' చిత్రం రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించింది. భారత్‌లోని 5,687 షోల ద్వారా రెండో రోజు రూ. 20.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలైంది.

ఇందులో తమిళ వర్షన్ నుంచి రూ. 16.50 కోట్లు రాగా, తెలుగు వర్షన్ నుంచి రూ. 3.85 కోట్ల వసూళ్లు నమోదు కావడం విశేషం. తొలి రోజు సాధించిన రూ. 19.15 కోట్లతో కలిపి, ఇప్పటివరకు భారతదేశంలో రెండు రోజుల్లో సీన్ సినిమాకు రూ. 39.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, రూ. 45.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

విదేశాల్లో సైతం సూర్య మానియా గట్టిగా నడుస్తోంది. ఓవర్సీస్‌లో రెండో రోజు రూ. 18 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, మొత్తం విదేశీ గ్రాస్‌ను రూ. 35.75 కోట్లకు పెంచుకుంది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 'సీన్' చిత్రం రూ. 81.65 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్‌ను ఖాతాలో వేసుకుంది.

సూర్య మునుపటి రికార్డులు తిరగరాసిన ‘సీన్’

ఈ ఏడాది సూర్య నటించిన గత రెండు చిత్రాల రెండు రోజుల రికార్డులను 'సీన్' అధిగమించడం విశేషం. 'కరుప్పు' సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 74.91 కోట్లు రాబట్టగా, 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ. 74.47 కోట్లు రాబట్టింది.

ఇప్పుడు 'సీన్' చిత్రం రెండు రోజుల్లోనే రూ. 81.65 కోట్లు సాధించి సూర్య కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 'కరుప్పు' చిత్రం లాంగ్ రన్‌లో రూ. 310.12 కోట్లు, 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూ. 209.46 కోట్లు వసూలు చేశాయి. అదే బాటలో 'సీన్' కూడా త్వరలోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వినోదం, సస్పెన్స్ కలగలిపిన కథాంశం

'సీన్' చిత్రంలో సూర్య 'ఇంబరాజ్' అనే పోలీస్ ఆఫీసర్‌గా తనదైన స్వాగ్, మాస్ యాటిట్యూడ్‌తో అలరించారు. ఒక జైలు నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక రహస్యం బయటపడటంతో కథ తీవ్రమైన మలుపు తిరుగుతుంది. ఈ చిత్రంతో నటి నజ్రియా నజీమ్ 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.

అలాగే మలయాళ నటుడు, ప్రేమలు హీరో నస్లేన్ కె గఫూర్ ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్య-జ్యోతికల 2D ఎంటర్‌టైన్‌మెంట్, ఝగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఆనందరాజ్, లాల్, రాజప్రియన్, సురేష్ మతియళగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతోపాటు

గ్రిప్పింగ్ స్క్రీన్‌ ప్లేతో పాటు ఫైట్ సీన్లలో కామెడీని మేళవించి దర్శకుడు తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీపావళి వరుస సెలవులు కలిసిరానుండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More