...
...
Next Story

Karuppu Collections: వీరభద్రుడు బాక్సాఫీస్ ప్రభంజనం.. 3 రోజుల్లోనే భారీ వసూళ్లు.. సూర్య, త్రిష మూవీ అదుర్స్

Karuppu Collections: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు' (తమిళంలో కరుప్పు) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు మీకోసం.

Published on: May 18, 2026, 10:29:36 IST
Advertisement

Karuppu Collections: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'వీరభద్రుడు' (తమిళంలో 'కరుప్పు') మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లీన్ స్వీప్ చేస్తూ ప్రేక్షకుల అంచనాలను నూటికి నూరు శాతం అందుకుంది.

వీరభద్రుడు అదుర్స్

వీరభద్రుడులో సూర్య
వీరభద్రుడులో సూర్య

సూర్య మూవీ వీరభద్రుడు థియేటర్లలో అదుర్స్ అనిపిస్తోంది. సూర్య మాస్ ఎలివేషన్స్ కు అభిమానులు వేసే కేకలు, ఈలలు, డాన్సులతో హాల్స్ అన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ అపూర్వ స్పందన బాక్సాఫీస్ కలెక్షన్లలో స్పష్టంగా కనిపిస్తోంది.

బాక్సాఫీస్ కలెక్షన్లు

వీరభద్రుడు చిత్రం కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 68 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా సూర్య, త్రిషలను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం విశేషం.

వసూళ్లు ఇలా

ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ సక్నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం, 'వీరభద్రుడు' చిత్రం మూడో రోజైన ఆదివారం (మే 17) నాడు రూ.28.35 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొదటి రోజు రూ.15.50 కోట్లతో ఓపెనింగ్స్ రాబట్టగా, శనివారం నాటికి కలెక్షన్లు మరింత పుంజుకుని రూ. 24.15 కోట్లకు చేరాయి. ఆదివారం నాటి వసూళ్లు మరింత పెరగడం విశేషం.

ఆదివారం నాటి కలెక్షన్లను పరిశీలిస్తే తమిళ వెర్షన్ ('కరుప్పు') ద్వారా రూ.24.20 కోట్లు రాగా, తెలుగు వెర్షన్ (వీరభద్రుడు) ద్వారా అదనంగా మరో రూ. 4.15 కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుతం ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు భాషల్లో కలిపి మొత్తం 6,818 షోలతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

సినిమా విశేషాలు

ఈ చిత్రంలో సూర్య కోర్టు రూమ్ పోరాటాలు చేస్తూనే, అవసరమైనప్పుడు రౌడీల దుమ్మురేపే ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో అలరించారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అశ్విన్ రవిచంద్రన్, రాహుల్ రాజ్, టి.ఎస్. గోపీకృష్ణన్, కరణ్ అరవింద్ కుమార్ స్క్రీన్‌ప్లే అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో మెరిసిన ఈ సినిమాలో స్వాసిక, ఇంద్రాన్స్, యోగి బాబు, శివద, నట్టి సుబ్రమణ్యం, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

నిజానికి ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 14నే విడుదల కావాల్సి ఉంది. కానీ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఎదుర్కొన్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో షోలు రద్దయ్యాయి. ఆ తర్వాత సమస్యలు సర్దుమణగడంతో ఒక రోజు ఆలస్యంగా అంటే మే 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 'వీరభద్రుడు' (కరుప్పు) సినిమా అధికారికంగా ఎప్పుడు విడుదలైంది?

జవాబు: కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా, మే 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

ప్రశ్న: ఈ చిత్రంలో సూర్య పోషించిన పాత్ర ఏమిటి?

జవాబు: ఈ సినిమాలో సూర్య అన్యాయాలపై తిరగబడే ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించారు.

ప్రశ్న: 'వీరభద్రుడు' సినిమాను తెలుగులో ఎవరు విడుదల చేశారు?

జవాబు: ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది.

ప్రశ్న: ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు?

జవాబు: ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks