...
...
Next Story

Peddi Release Date: డైరెక్టర్ ఒక మాట.. హీరో మరో మాట.. పెద్ది రిలీజ్ డేట్‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌.. ముందుగానే విడుదల

Peddi Release Date: పెద్ది మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముందుగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జూన్ లో రిలీజ్ అన్నారు, కానీ డేట్ పై మాత్రం తలో మాట వినిపిస్తోంది.

Published on: May 1, 2026, 09:21:21 IST
Advertisement

Peddi Release Date: మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘పెద్ది’. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఇదొకటి. అయితే ఇప్పటికీ పెద్ది మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడం గమనార్హం. పెద్ది రిలీజ్ డేట్ పై డైరెక్టర్ ఒక మాట, హీరో మరో మాట చెప్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్, బుచ్చిబాబు (x/peddi)
రామ్ చరణ్, బుచ్చిబాబు (x/peddi)

నిజానికి పెద్ది మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. మార్చి 27న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. అనంతరం జూన్ లో థియేటర్లకు తీసుకొస్తామని మరోసారి వాయిదా వేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ అనౌన్స్ మెంట్

తాజాగా పెద్ది రిలీజ్ డేట్ పై డైరెక్టర్ బుచ్చిబాబు సాన చేసిన అనౌన్స్ మెంట్ వైరల్ గా మారింది. ఈ మూవీ జూన్ 25న రిలీజ్ అవుతుందని ‘కర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మళ్లీ మారుతుందనే బజ్ వినిపిస్తోంది. జూన్ 25 న కాదు జూన్ 4నే పెద్ది థియేటర్లకు వస్తుందని అంటున్నారు.

తలో మాట

పెద్ది రిలీజ్ డేట్ పై తలో మాట వినిపిస్తోంది. గతంలో మార్చి 27న సినిమా తీసుకొస్తామన్నారు. కానీ మార్చి 26నే వస్తుందని బుచ్చిబాబు చెప్పాడు. ఆ తర్వాత ఏప్రిల్ 30 పక్కా రిలీజ్ చేస్తామన్నారు. రాకాస మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. మరోసారి వాయిదా పడదన్నాడు. కానీ మూవీ జూన్ కు వెళ్లింది.

టాక్సిక్ వాయిదాతో

ఇక అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం జూన్ 26న రిలీజ్ అవుతుందని మరోసారి మేకర్స్ స్పష్టం చేశారు. నాగార్జున రీసెంట్ పోస్టులో ఇదే రిలీజ్ డేట్ ను మెన్షన్ చేశాడు. ఈ నేపథ్యంలో ‘పెద్ది’ మూవీ రిలీజ్ ముందుగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జూన్ 4 రిలీజ్ పై మేకర్స్ త్వరలోనే అనౌన్స్ మెంట్ చేసే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks