Suyodhana OTT: తెలుగు మిస్టరీ థ్రిల్లర్ ‘సుయోధన’ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 17) సుయోధన మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది. ఇదో డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ.
సుయోధన ఓటీటీ

ప్రియదర్శి, సీనియర్ నటుడు సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ ‘సుయోధన’. ఇదో మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ సర్ ప్రైజ్ చేసింది.
మూడు వారాలకే
సుయోధన మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, ప్రియదర్శితో పాటు ప్రేమ, ద్రిషిక చందర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి వైఎస్ మాధవ్ రెడ్డి డైరెక్టర్. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్ పై బోసుబాబు నిడుమోలు దీన్ని నిర్మించారు.
9.6 ఐఎండీబీ
సుయోధన మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్పందన రాలేదు. కాన్సెప్ట్, ట్రైలర్ తో బజ్ క్రియేట్ చేసినా బిగ్ స్క్రీన్ పై పెద్దగా ఆడలేదు. అయితే ఈ మూవీకి ఐఎండీబీలో మాత్రం ఏకంగా 9.6 రేటింగ్ ఉండటం విశేషం.
ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ లో ఏ మేరకు రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఓటీటీలో సుయోధన మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సుయోధన స్టోరీ
{{/usCountry}}ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ లో ఏ మేరకు రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. ఓటీటీలో సుయోధన మూవీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
సుయోధన స్టోరీ
{{/usCountry}}సుయోధన సినిమా ఓ మిస్టరీ థ్రిల్లర్. వరుణ్ (ప్రియదర్శి) ఒక ‘ఫోలే’ (సినిమాల్లో సౌండ్స్ డిజైన్ చేసే ఆర్టిస్ట్) ఆర్టిస్ట్. అతనికి చిన్నప్పటి నుంచి సుయోధన అనే మిస్టీరియస్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే దుర్యోధనుడి రూపం తన కళ్ల ముందు కనిపిస్తుంది. అలా జరిగినప్పుడు వరుణ్ చాలా భయపడుతుంటాడు.
అయితే వరుణ్ తండ్రి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలు వేస్తుంటాడు. ప్రకాష్ కు దుర్యోధనుడి పాత్ర అంటే చాలా ఇష్టం. మరోవైపు ఒక డెమో ఫిల్మ్ షూట్ చేయడానికి వచ్చిన సమిత (ద్రిషిక)తో వరుణ్ కు పరిచయం కలుగుతుంది. సమిత షూట్ చేసిన క్యారెక్టర్ కూడా వరుణ్ కు దుర్యోధనుడిలాగే కనిపిస్తుంది.
తండ్రి హత్య
ఓ సారి వరుణ్ కు తండ్రి ప్రకాష్ దుర్యోధనుడిలా కనిపిస్తాడు. ఆ తర్వాత ప్రకాష్ హత్యకు గురవుతాడు. అసలు సుయోధన అనే శబ్ధం వరుణ్ కే వినిపించడానికి కారణం ఏంటీ? ప్రకాష్ ను ఎవరు చంపారు? అనేది సుయోధన మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.