Real Crime Thriller Talvar OTT Release: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు వచ్చిపడుతుంటాయి. అయితే అందులో కొన్ని చిత్రాలు మాత్రమే ఓటీటీ వీక్షకుల మనసుపై బలమైన ముద్ర వేస్తాయి. అలాంటి కోవకు చెందినదే 2015లో విడుదలైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'తల్వార్'.
జంట హత్యల కేసు ఆధారంగా

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నోయిడా ఆరుషి తల్వార్ జంట హత్యల కేసు ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికీ ఓటీటీలో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది ఈ తల్వార్ సినిమా. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు ఇష్టపడే వారికి అద్భుతమైన విందులా ఈ సినిమా నిలుస్తుంది.
ఒకే ఇంట్లో రెండు శవాలు.. క్లూ లేని మిస్టరీ
కథ విషయానికి వస్తే, ఒకే ఇంట్లో శృతి అనే చిన్నారి, వారి ఇంట్లోనే పనిచేసే ఖేమ్‌పాల్ అనే వ్యక్తి ఘోర హత్యకు గురవుతారు. సంఘటన జరిగిన సమయంలో ఇల్లు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో, స్థానిక పోలీసులు బాలిక తల్లిదండ్రులైన రమేష్, నూతన్‌లపైనే అనుమానం వ్యక్తం చేస్తారు.
పరువు హత్యేనంటూ
ఇది పరువు హత్యేనంటూ ప్రాథమిక ముగింపునకు వచ్చి విచారణ ముగిస్తారు. ఆధారాలు సేకరించడంలో స్థానిక పోలీసు వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. అయితే అసలు మిస్టరీ అక్కడి నుంచే మొదలవుతుంది.
సీబీఐ ఆఫీసర్‌గా ఇర్ఫాన్ ఖాన్ విశ్వరూపం
కేసు తీవ్రత దృష్ట్యా ఈ దర్యాప్తు బాధ్యతలను కేంద్ర పరిశోధన సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తారు. సీబీఐ అధికారి అశ్విన్ కుమార్ పాత్రలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. రొటీన్ విచారణకు భిన్నంగా అశ్విన్ కుమార్ తల్లిదండ్రులను నిర్దోషులుగా భావిస్తూ విచారణను సరికొత్త కోణంలోకి తీసుకెళ్తారు.
రెండు వేర్వేరు సీబీఐ టీమ్స్ విచారణ
పనిమనిషి స్నేహితులపై అనుమానంతో 'ట్రూత్ సీరమ్' పరీక్షలు నిర్వహించి అసలు నిజాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వ్యవస్థలోని లోపాలు, అధికారుల మధ్య అంతర్గత విభేదాల కారణంగా దర్యాప్తు మరో బృందానికి చేరుతుంది. రెండు వేర్వేరు సీబీఐ బృందాలు ఒకే కేసును రెండు భిన్న కోణాల్లో చూసినప్పుడు సమాజం, న్యాయ వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తాయో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ఐఎమ్‌డీబీ 8.1 రేటింగ్
{{/usCountry}}పనిమనిషి స్నేహితులపై అనుమానంతో 'ట్రూత్ సీరమ్' పరీక్షలు నిర్వహించి అసలు నిజాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వ్యవస్థలోని లోపాలు, అధికారుల మధ్య అంతర్గత విభేదాల కారణంగా దర్యాప్తు మరో బృందానికి చేరుతుంది. రెండు వేర్వేరు సీబీఐ బృందాలు ఒకే కేసును రెండు భిన్న కోణాల్లో చూసినప్పుడు సమాజం, న్యాయ వ్యవస్థ ఎలా ప్రవర్తిస్తాయో ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ఐఎమ్‌డీబీ 8.1 రేటింగ్
{{/usCountry}}ఈ తల్వార్ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్‌తో పాటు కొంకణా సేన్ శర్మ, నీరజ్ కాబీ తమ నటనతో జీవించారు. విశాల్ భరద్వాజ్ అందించిన స్క్రీన్‌ప్లే, సంభాషణలు సినిమాకు ప్రధాన బలమని చెప్పవచ్చు. ఐఎమ్‌డీబీ (IMDb)లో 8.1 రేటింగ్ సాధించిన ఈ తల్వార్ ఓటీటీ రిలీజ్ సమయంలో మాత్రమే కాకుండా నేటికీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అత్యధికంగా వీక్షించే క్రైమ్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రం
రియల్ ఇన్సిడెంట్ క్రైమ్‌తో తెరకెక్కిన తల్వార్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని ఈ తల్వార్ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్.