...
...
Next Story

Tamanna: ట్రెడిషనల్ లుక్‌లో అట్రాక్ట్ చేసిన తమన్నా- భక్తి పారవశ్యంగా సాగే సాంగ్ రిలీజ్- ఆ పూజ విశిష్టత చెప్పేలా!

Tamanna Traditional Look In Chhath Puja Song: సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా జంటగా నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' సినిమా నుంచి భక్తిరసంతో కూడిన 'ఛటీ మైయా' పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా ఎంతో ట్రెడిషనల్ లుక్‌తో అట్రాక్ట్ చేసింది.

Published on: Sep 11, 2026, 11:00:21 IST
Advertisement

Tamanna Traditional Look In Chhath Puja Song: బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తొలిసారిగా జోడీ కట్టిన చిత్రం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvaan: Force of the Forest). దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సినిమాపై బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.

ట్రెడిషనల్‌గా తమన్నా

ట్రెడిషనల్ లుక్‌లో అట్రాక్ట్ చేసిన తమన్నా- భక్తి పారవశ్యంగా సాగే సాంగ్ రిలీజ్- ఆ పూజ విశిష్టత చెప్పేలా!
ట్రెడిషనల్ లుక్‌లో అట్రాక్ట్ చేసిన తమన్నా- భక్తి పారవశ్యంగా సాగే సాంగ్ రిలీజ్- ఆ పూజ విశిష్టత చెప్పేలా!

ప్రమోషన్లలో భాగంగా గురువారం (సెప్టెంబర్ 10) రోజున ఈ సినిమా నుంచి ‘ఛటీ మైయా’ (Chhathi Maiya) అనే దైవికమైన పాటను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా తమన్నా ట్రెడిషనల్‌గా కనిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది.

దేవుడిపై నమ్మకం.. ఆపై ఒక అద్భుతం!

కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా .. తమన్నా భక్తిని, ఆమె నమ్మకాలను ప్రశ్నించే దృశ్యంతో పాట ప్రారంభమవుతుంది. అయినప్పటికీ, తమన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బీహార్, యుపీల్లో అత్యంత పవిత్రంగా జరుపుకొనే 'ఛత్ పూజ' వేడుకల్లో నిష్టతో పాల్గొంటుంది. నదీ తీరాన ఇతర మహిళలతో కలిసి ఆమె దేవుడిని పూజించే దృశ్యాలు ఆకట్టుకుంటాయి.

పాట చివరిలో ఒక అనుకోని ప్రమాదం జరగడం, ఆ వెంటనే ఒక అద్భుతం జరిగి సిద్ధార్థ్-తమన్నా ఇద్దరిలోనూ దైవచింతన పెరగడం ఈ పాటలోని ప్రధాన ఘట్టం. తెలుగు పాఠకులకు ఛత్ పూజ గురించి చెప్పాలంటే.. ఇది సూర్య భగవానుడిని, ఛటీ మైయా దేవిని ఆరాధించే అత్యంత కఠినమైన వ్రతం. మన దగ్గర బోనాలు లేదా కాళీమాత ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో, ఉత్తరాది వారికి ఈ పండుగ అంత ప్రత్యేకం.

బీహార్ ఆత్మగౌరవాన్ని వెండితెరకు ఎక్కించాం!

"దేశంలోనే ప్రత్యేకమైన బీహార్ ఆత్మగౌరవాన్ని మనసారా ప్రతిబింబించేందుకు మేం చేసిన ఒక చిన్న ప్రయత్నమిది. షూటింగ్ సమయంలో మేం అనుభవించిన ఆధ్యాత్మిక భావనను ప్రేక్షకులు కూడా అంతే అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను" అని తమన్నా పేర్కొంది.

సినిమాలోకి తీసుకురావడం నాకు దక్కిన గొప్ప గౌరవం

సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా మాట్లాడుతూ సంప్రదాయాలను ప్రపంచానికి చాటడమే తమ లక్ష్యమని చెప్పాడు. "బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎంతో పవిత్రంగా భావించే ఛత్ పూజ సంస్కృతిని హిందీ సినిమాలోకి తీసుకురావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సువాసనలు ప్రపంచ నలుమూలలకూ వ్యాపించాలన్నదే నా ఆకాంక్ష" అని విశాల్ మిశ్రా వివరించారు.

సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్

ఈ పాటకు కౌశల్ కిషోర్ సాహిత్యం అందించగా, చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీ చేశారు. విశాల్ మిశ్రా, కందర్ప కలిత సంయుక్తంగా సంగీత నిర్మాణం వహించారు. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణాభ్ కుమార్, నీరజ్ కొఠారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే, ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks