రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic - A Fairytale For Grown-Ups). ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది.
మరో హీరోయిన్

ఇప్పటికే టాక్సిక్ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి వంటి ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఇప్పుడు టాక్సిక్‌లో మరో బాలీవుడ్ హీరోయిన్ యాక్ట్ చేస్తోంది. ఆ బ్యూటీనే తారా సుతారియా. బాలీవుడ్‌లో హాట్ భామగా పేరు తెచ్చుకుంది తారా సుతారియా.
తాజాగా ఇవాళ శనివారం (జనవరి 3) టాక్సిక్ నుంచి తారా సుతారియా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ సినిమాలో రెబెక్కా పాత్రలో తారా సుతారియా నటిస్తోంది.
ఇంటెన్స్ లుక్‌లో ‘రెబెక్కా’
రెబెక్కా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తారా సుతారియా వింటేజ్ లుక్‌లో మెరిసిపోతోంది. స్ట్రాప్‌లెస్ గౌను, లేస్ గ్లౌవ్స్ ధరించి, ఓల్డ్ హెయిర్ స్టైల్‌తో ఎంతో గంభీరంగా కనిపిస్తోంది. తారా సుతారియా చేతిలో ఒక గన్ పట్టుకుని ఎవరినో గురిపెట్టినట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాలోని ఆమె పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది.
“ఆమెకు అధికారం, తుపాకులు వాడటం పుట్టుకతో వచ్చిన హక్కు” అంటూ చిత్ర యూనిట్ ఆమె పాత్రను పరిచయం చేసింది. దీన్నిబట్టి రెబెక్కా అనే పవర్‌ఫుల్ పాత్రను తారా సుతారియా చేస్తున్నట్లు తెలుస్తోంది.
పవర్‌ఫుల్ అవతారంలో తారా
యష్ తన సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్‌ను పంచుకుంటూ, “రెబెక్కా పాత్రలో తారా సుతారియాను పరిచయం చేస్తున్నాను” అని పేర్కొన్నారు. పవర్‌ఫుల్ అవతారంలో మెరిసిన తారా సుతారియా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది.
{{/usCountry}}యష్ తన సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్‌ను పంచుకుంటూ, “రెబెక్కా పాత్రలో తారా సుతారియాను పరిచయం చేస్తున్నాను” అని పేర్కొన్నారు. పవర్‌ఫుల్ అవతారంలో మెరిసిన తారా సుతారియా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది.
{{/usCountry}}కాగా, ఇప్పటికే టాక్సిక్ చిత్రం నుంచి కియారా అద్వానీ (నాడియా), హుమా ఖురేషీ (ఎలిజబెత్), నయనతార (గంగా) లుక్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వారందరిలాగే తారా లుక్ కూడా రెట్రో థీమ్‌లోనే ఉండటం విశేషం.
సినిమా నేపథ్యం
ఇకపోతే ‘టాక్సిక్’ ఒక పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్‌తో పాటు యశ్ కూడా స్వయంగా రచనలో పాలుపంచుకున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యష్, నయనతార, కియారా అద్వానీ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
గతంలో గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన 'లయర్స్ డైస్', 'మూథన్' వంటి చిత్రాలు కళాత్మక ధోరణిలో సాగగా.. టాక్సిక్ మాత్రం కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ కథతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఉగాది పండుగకు
టాక్సిక్ సినిమాను ఒకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తుండగా.. ఇతర దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. అన్నీ కుదిరితే టాక్సిక్ చిత్రం మార్చి 19న ఉగాది పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.