...
...
Next Story

Tara Sutaria: టాక్సిక్ రిలీజ్‌కు ముందు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తారా సుతారియా అరంగేట్రం- ఐశ్వర్య రాయ్, అలియా భట్ కూడా!

Tara Sutaria Cannes Film Festival 2026 Debut: భారీ అంచనాల టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్న బాలీవుడ్ హాట్ భామ తారా సుతారియా ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. ప్రతిష్టాత్మక కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో తారా తొలిసారిగా మెరవనున్నారు. టాక్సిక్ రిలిజ్‌కు ముందే ఈ అవకాశం రావడం విశేషంగా మారింది.

Published on: May 3, 2026, 06:11:29 IST
Advertisement

Tara Sutaria Cannes Film Festival 2026 Debut: ఫ్రాన్స్‌ వేదికగా జరిగే 79వ కేన్స్‌ చలనచిత్రోత్సవాలు (Cannes Film Festival 2026) మే 12న ప్రారంభమై మే 23 వరకు జరగనున్నాయి. ఏటా భారతీయ సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేస్తూ ఉంటారు. ఈ ఏడాది ఈ జాబితాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ, టాక్సిక్ హీరోయిన్ తారా సుతారియా పేరు చేరింది.

రెడ్ కార్పెట్‌పై తారా

టాక్సిక్ రిలీజ్‌కు ముందు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తారా సుతారియా అరంగేట్రం- ఐశ్వర్య రాయ్, అలియా భట్ కూడా! (Photo: Instagram)
టాక్సిక్ రిలీజ్‌కు ముందు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తారా సుతారియా అరంగేట్రం- ఐశ్వర్య రాయ్, అలియా భట్ కూడా! (Photo: Instagram)

హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. తారా సుతారియా ఒక అంతర్జాతీయ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రెడ్‌ కార్పెట్‌పై నడవనున్నారు. యశ్ హీరోగా రూపొందిన భారీ చిత్రం 'టాక్సిక్' (Toxic) కు సంబంధించిన క్రేజ్ తారా సుతారియాకు ఈ అవకాశం దక్కేలా చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

కేన్స్‌లో అడుగుపెట్టడం ద్వారా తన కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తారా సుతారియా భావిస్తున్నారు. ఈ ఏడాది తారాతో పాటు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అలియా భట్ వంటి అగ్ర తారలు కూడా కేన్స్‌లో మెరవనున్నారు. మరోవైపు, భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా ఈసారి కేన్స్‌లో జ్యూరీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించడం విశేషం.

'టాక్సిక్'లో తారా సుతారియా లుక్

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాలో తారా సుతారియా 'రెబెక్కా' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 3న విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తారా ప్రతిభను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇప్పటికే పలుమార్లు ప్రశంసించారు.

టాక్సిక్ సినిమాలో యశ్, తారా సుతారియాతోపాటు కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా కన్నడ, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పట్ల భారీ ఆసక్తి నెలకొంది.

సినిమా విడుదలపై యశ్ క్లారిటీ

వాస్తవానికి 'టాక్సిక్' జూన్ 4న విడుదల కావాల్సి ఉంది. అయితే, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్, అంతర్జాతీయ భాగస్వామ్య ఒప్పందాల కారణంగా సినిమా విడుదల కాస్త ఆలస్యమవుతుందని యశ్ ధ్రువీకరించారు.

యశ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ జాప్యం వల్ల రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్-2'తో ఉండాల్సిన బాక్సాఫీస్ పోటీ తప్పింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe