...
...
Next Story

OTT Romantic: ఓటీటీలోకి రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ సిరీస్.. స్మతి మంధానలా అవ్వాలనుకుంటే మలుపుతిప్పే ప్రెగ్నెన్సీ!

Teen Tigada OTT Streaming: ఓటీటీలోకి రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ టీన్ తిగడా స్ట్రీమింగ్ కానుంది. స్మృతి మంధానల క్రికెటర్‌ని చేయాలనుకునే తల్లిదండ్రులకు తన కూతురు ప్రెగ్నెన్సీతో పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ఆమె కలలను కూడా మలుపుతిప్పుతుంది. ఇలాంటి టీన్ తిగడా ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.

Published on: Nov 16, 2026, 19:34:59 IST
Advertisement

Teen Tigada OTT Release: ప్రేమకు వయసుతో పాటు ఎన్నో ఆశలు, ఆశయాలు తోడవుతుంటాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ప్రేమ, కెరీర్, జీవితంలో ఏదో సాధించాలనే తపన.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వీటితో పాటు జీవితంలోఊహించ‌ని మలుపులు కూడా ఎదురవుతుంటాయి.

సంగీతం, క్రికెట్ నేపథ్యంగా

ఓటీటీలోకి రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ సిరీస్.. స్మతి మంధానలా అవ్వాలనుకుంటే మలుపుతిప్పే ప్రెగ్నెన్సీ!
ఓటీటీలోకి రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ సిరీస్.. స్మతి మంధానలా అవ్వాలనుకుంటే మలుపుతిప్పే ప్రెగ్నెన్సీ!

ఇలాంటి అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీ సిరీస్ ‘టీన్ తిగడా’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమ, ఆశయాలు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. సంగీతం, క్రికెట్ నేపథ్యంగా సాగే కథలో యువత తమ కలలను నిజం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు, ప్రేమలో ఎదురయ్యే అనుభవాలు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆసక్తికరంగా చూపించనున్నారు.

ప్రేమలో పడటం, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో పాటు అనుకోని సంఘటనలు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయన్నది ఇందులో చూడొచ్చు. ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ, అర్చిక అరోరా, సమర్థ్ మెహతా, గ్రుషా కపూర్ కీలక పాత్రల్లో నటించారు.

టీన్ తిగడా ఓటీటీ స్ట్రీమింగ్

స్ట్రీట్‌ల్యాంప్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ, ఐ స్క్రీమ్ డ్రీమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ ఓటీటీ సిరీస్‌ను నిర్మించాయి. నవంబర్ 20 నుంచి జీ5లో టీన్ తిగడా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

మరోవైపు కూతురు అస్మానిని స్మృతి మంధాన వంటి క్రికెటర్‌లా చూడాలనుకుంటారు పేరెంట్స్. కానీ, అనుకోకుండా అస్మాని గర్భం దాల్చి వారి జీవితాలను ఒక్కసారిగా మార్చేస్తుంది. దీంతో అప్పటివరకు సాగిన వారి ప్రేమకథ ఊహించని మలుపు తిరుగుతుంది.

ఓవైపు తమ కలలు, మరోవైపు ప్రేమ, మ‌రో వైపు కొత్తగా ఎదురైన బాధ్యతలు.. ఇలా ఎన్నో సవాళ్ల మధ్య ఈ జంట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? వారి భవిష్యత్తు ఎలా మారింది? అనేది ఆస‌క్తిక‌రంగా అనిపిస్తోంది. యూత్‌ఫుల్ రొమాన్స్, సరదా సన్నివేశాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సిరీస్ జీ5 ఓటీటీలో అలరించేందుకు రెడీ అయింది.

ప్రసన్న బిష్ట్ కామెంట్స్

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నటి ప్రసన్న బిష్ట్ మాట్లాడుతూ.. "‘టీన్ తిగడా’ కథ చాలా సహజంగా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్కింది. మనం ఆశించిన‌ట్లే జీవితం సాగనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనేది ఇందులో చూపించారు". అని అన్నారు.

"ఈ సిరీస్‌లో నా పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. మ‌న జీవితాన్ని మ‌నం ఒక‌లా ప్లాన్ చేస్తే.. జీవితం మాత్రం మరోలా ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారడం ఈ పాత్రలో నాకు మంచి అనుభూతిని ఇచ్చింది" అని హీరోయిన్ ప్రసన్న బిష్ట్ తెలిపారు.

జీ5 ఓటీటీలో రిలీజ్

"ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుకోని ప‌రిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో మన లక్ష్యాలను మళ్లీ గుర్తు చేసుకుని ముందుకు వెళ్లడానికి కొంచెం ధైర్యం ఉంటే చాలు. ముఖ్యంగా యువత ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వయసులోనే మనల్ని మనం అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం, కొత్త విషయాలను తెలుసుకోవడం వంటివి జరుగుతుంటాయి" అని ఆమె చెప్పుకొచ్చారు.

"ప్రేమ, కామెడీ, సరదా సన్నివేశాలు, ఊహించని మలుపులతో ‘టీన్ తిగడా’ అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందించాం. ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్ష‌కుల‌కు మెప్పిస్తుంది. నవంబర్ 20న జీ5లో ఓటీటీ రిలీజ్ కానున్న ఈ సిరీస్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని ఆకాంక్షించారు నటి ప్రసన్న బిష్ట్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks