సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు సంబంధించిన వివాదాలను సింగిల్ జడ్జి దగ్గరే తేల్చుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్‌పీ దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

మన శంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ చిత్రాల టిక్కెట్ల ధరల పెంపుదలకు అనుమతిస్తూ ప్రభుత్వ మెమోను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మునుపటి ఆదేశాలను అప్పీల్‌ను సవాలు చేసింది. టిక్కెట్ ధరల పెంపుపై భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాన్ని కనీసం 90 రోజుల ముందుగానే ప్రకటించాలని సింగిల్ జడ్జి.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై షైన్ స్క్రీన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అప్పీల్ చేసింది.
అక్కడే చెప్పుకోండి
తాజాగా ఇరువైపులా వాదనలు విన్న డివిజన్ బెంచ్.., సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలకు సంబంధించిన పిటిషన్లు ప్రస్తుతం సింగిల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే ఆ విషయాలను విచారించే సింగిల్ జడ్జి ముందు చెప్పుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు బెంచ్ నిరాకరించింది. ఈ సమస్యను సింగిల్ జడ్జి స్థాయిలో పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించింది.
రిట్ పిటిషన్‌లోనే
అప్పీలుదారుడు లేవనెత్తిన అంశాలను మధ్యంతర ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడం ద్వారా కాకుండా సింగిల్ జడ్జి బెంచ్ ముందు కొనసాగుతున్న రిట్ పిటిషన్‌లో పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
సినిమాపై ప్రభావం పడలేదు
'అప్పీలుదారుని విషయానికొస్తే తాత్కాలిక ఉత్తర్వు సినిమా విడుదలను ప్రభావితం చేయనట్లు కనిపిస్తోంది. తాత్కాలిక ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఈ అప్పీలును స్వీకరించడానికి మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు.' అని కోర్టు పేర్కొంది. రిట్ పిటిషన్‌లో ఉన్న అంశాలపై అప్పీలుదారు, ఇతర పార్టీలకు స్వేచ్ఛను మంజూరు చేసింది.
చిరంజీవి సినిమాతో
{{/usCountry}}'అప్పీలుదారుని విషయానికొస్తే తాత్కాలిక ఉత్తర్వు సినిమా విడుదలను ప్రభావితం చేయనట్లు కనిపిస్తోంది. తాత్కాలిక ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఈ అప్పీలును స్వీకరించడానికి మాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు.' అని కోర్టు పేర్కొంది. రిట్ పిటిషన్‌లో ఉన్న అంశాలపై అప్పీలుదారు, ఇతర పార్టీలకు స్వేచ్ఛను మంజూరు చేసింది.
చిరంజీవి సినిమాతో
{{/usCountry}}చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ధరల పెంపునకు అనుమతిస్తూ జనవరి 8న జారీ చేసిన మెమో ఆధారంగా ఈ కేసు వచ్చింది. సినిమా టిక్కెట్ల ధరలో అకస్మాత్తుగా పెరుగుదల వల్ల ప్రజలు సమీక్షలు లేదా ప్రాతినిధ్యాలను దాఖలు చేసే హక్కు లేకుండా పోతుందని పిటిషనర్, న్యాయవాది దాచేపల్లి చంద్రబాబు ఈ మెమోను సవాలు చేశారు. చట్టం ప్రకారం సమీక్షలు లేదా ప్రాతినిధ్యాలను దాఖలు చేసే హక్కును నిరోధిస్తున్నారని ఆయన వాదించారు.
ఆ తర్వాత సినిమా విడుదల తేదీకి 90 రోజుల ముందు టికెట్ ధరలను పెంచడంపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేక్షకులతో సహా వాటాదారులు ఈ నిర్ణయంపై సమీక్ష కోసం దాఖలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత షైన్ స్క్రీన్స్ ఇండియా ఈ మధ్యంతర ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసింది. తాజాగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులో జోక్యం చేసుకోకుండా అప్పీలును కొట్టివేసింది. ఏదైనా ఉంటే సింగిల్ బెంచ్ దగ్గరే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.