Tollywood Half Year 2026 Report: టాలీవుడ్ బాక్సాఫీస్ 2026 మొదటి ఆరు నెలల కాలం రోలర్ కోస్టర్‌లా ముగిసింది. సంక్రాంతి సందడితో మొదలైన ఈ ఏడాది తెలుగు సినిమాల ప్రయాణం సమ్మర్ కానుకగా వచ్చిన వైవిధ్యమైన చిత్రాల వరకు ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచాయి.
147 సినిమాలు, 6 వేల 300 కోట్ల కలెక్షన్స్

పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పాటు కంటెంట్ నమ్ముకుని వచ్చిన చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. ట్రేడ్ వర్గాల అధికారిక లెక్కల ప్రకారం ఈ ఆరు నెలల కాలంలో దాదాపు 147 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ చిత్రాల ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం రూ. 6,300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించగా, కోట్లు కుమ్మరించిన కొన్ని భారీ అంచనాల చిత్రాలు డిస్ట్రిబ్యూటర్లను నిలువునా ముంచేశాయి. మరి ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన 4 బెస్ట్ సినిమాలు, వాటి బడ్జెట్, కలెక్షన్ల, అవి హిట్ అవ్వడానికి కారణాలను ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ రికార్డుల వేట - మన శంకర వరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ మ్యారేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు'. సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో నవ్వుల జాతర తెచ్చింది. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
విడుదల తేదీ: 14 జనవరి, 2026
{{/usCountry}}విడుదల తేదీ: 14 జనవరి, 2026
{{/usCountry}}బడ్జెట్: సుమారు రూ. 200 కోట్లు
బాక్సాఫీస్ వసూళ్లు: ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 310 కోట్లు
హిట్ అవ్వడానికి కారణం: చిరంజీవి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ వినోదం తోడవడమే ఈ సినిమా సక్సెస్ సీక్రెట్. నయనతార ఇంట్లో జరిగే కామెడీ సీన్లు మహిళా ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. "చిరంజీవి గారి టైమింగ్ ఈ సినిమాను హిస్టారిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది" అని ప్రముఖ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
వంద కోట్ల క్లబ్‌లో నవీన్ పోలిశెట్టి - అనగనగా ఒక రాజు
'జాతి రత్నాలు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నవీన్ పోలిశెట్టి సోలో హీరోగా తన స్టామినా ఏంటో నిరూపించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.
విడుదల తేదీ: 14 జనవరి, 2026
చిత్ర బడ్జెట్: సుమారు రూ. 35 కోట్లు
బాక్సాఫీస్ వసూళ్లు: ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్
హిట్ అవ్వడానికి కారణం: నవీన్ పోలిశెట్టి వన్-మ్యాన్ షో ఈ సినిమాకు ప్రధాన బలం. యువతను ఆకట్టుకునే టైమింగ్, కథలో ఉన్న సహజత్వం, మీనాక్షి చౌదరి గ్లామర్ ప్రేక్షకులను బాగా హుక్ చేశాయి. ఈ విజయంతో టాలీవుడ్‌లో అత్యంత నమ్మకమైన మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా నవీన్ మారిపోయారు.
శర్వానంద్ సాలిడ్ కంబ్యాక్ - నారీ నారీ నడుమ మురారి
యంగ్ హీరో శర్వానంద్ చాలా కాలం తర్వాత తన మార్క్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. సంక్రాంతి రేసులో పోటీగా వచ్చినప్పటికీ ఈ సినిమా క్లాస్ ఆడియన్స్‌ను విపరీతంగా మెప్పించింది.
విడుదల తేది: 14 జనవరి, 2026
చిత్ర బడ్జెట్: సుమారు రూ. 21 కోట్లు
బాక్సాఫీస్ వసూళ్లు: ప్రపంచవ్యాప్తంగా రూ. 36.25 కోట్లు
హిట్ అవ్వడానికి కారణం: ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగే యువకుడిగా శర్వానంద్ నటన థియేటర్లలో నవ్వులు పూయించింది. పండుగ వాతావరణానికి తగ్గట్టుగా ఆహ్లాదకరమైన పాటలు, ఫ్యామిలీ సెంటిమెంట్ పండటంతో ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌లో బెస్ట్ కంబ్యాక్‌గా నిలిచింది.
క్లాసిక్ హిట్‌గా 'మా ఇంటి బంగారం'
కంటెంట్ ఉంటే లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయని నిరూపించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'మా ఇంటి బంగారం'. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలను సరైన మోతాదులో కలిపి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు నందిని రెడ్డి.
విడుదల తేది: 19 జూన్, 2026
చిత్ర బడ్జెట్: సుమారు రూ. 20 కోట్లు
బాక్సాఫీస్ వసూళ్లు: ప్రపంచవ్యాప్తంగా రూ. 96.5 కోట్లకు పైగా వసూళ్లు
హిట్ అవ్వడానికి కారణం: కథలో ఉన్న ఎమోషనల్ డెప్త్, పాత్రల డిజైనింగ్ ప్రేక్షకులను కదిలించాయి. సమంత యాక్షన్స్ సీన్స్ అలరించడంతోపాటు ఇంట్లో కోడలిగా చేసే సన్నివేశాలు నవ్వించాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గానూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడానికి కుటుంబ ప్రేక్షకుల ఆదరణే కారణం.
సెకండాఫ్‌లో ఎలాంటి సినిమాలు
2026 ప్రథమార్ధంలో కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, బలమైన కథలు ఉంటేనే థియేటర్లకు జనాలు వస్తారని స్పష్టమైంది. రానున్న సెకండ్ హాఫ్‌లో ఎలాంటి సినిమాలు వస్తాయో వేచి చూడాలి.