Harshvardhan Rane 3.5 Cr Car Gifted By Deepak Mukut: తెలుగు సినిమాలతో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో హర్షవర్ధన్ రాణేకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా 'సనమ్ తేరీ కసమ్' నిర్మాత దీపక్ ముకుట్ తన హీరోకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మూడున్నర కోట్లకుపైగా ధర

భారత మార్కెట్లో రూ.3.5 కోట్లకు పైగా విలువ చేసే సరికొత్త 'ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా' (Land Rover Defender Octa) లగ్జరీ కారును హర్షవర్ధన్‌కు బహుమతిగా అందించారు. కారు తాళాలు అందిస్తున్న ఫోటోను హర్షవర్ధన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
'తకిట తకిట', 'అవును', 'ప్రేమ ఇష్క్ కాదల్' వంటి తెలుగు చిత్రాలతో మన ప్రేక్షకులకు సుపరిచితుడైన హర్షవర్ధన్ రాణే ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టారు. అక్కడ ఆయనకు లైఫ్ ఇచ్చిన సినిమా 'సనమ్ తేరీ కసమ్'. గతేడాది ఈ సినిమా రీ-రిలీజ్ సమయంలో హర్షవర్ధన్ చేసిన ప్రచారం నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.
మాట నిలబెట్టుకున్న నిర్మాత.. సీక్వెల్ కోసం హీరో డిమాండ్!
హర్షవర్ధన్‌కు కారు బహుమతిగా ఇస్తున్న ఫోటోను బాలీవుడ్ నిర్మాత దీపక్ ముకుట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగపూరిత నోట్ రాశారు. "గతేడాది 'సనమ్ తేరీ కసమ్' రీ రిలీజ్ సమయంలో నువ్వు మా సినిమాకు అండగా నిలబడ్డావు. నాడు నువ్వు సినిమా కోసం నిలబడినట్లే, నేడు నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. నా కృతజ్ఞతకు ఇది ఒక చిన్న గుర్తు మాత్రమే" అని దీపక్ ముకుట్ పేర్కొన్నారు.
నిర్మాత పోస్ట్‌ను రీషేర్ చేసిన హర్షవర్ధన్, ఆయనపై ప్రశంసలు కురిపిస్తూనే అభిమానుల తరఫున ఒక పెద్ద కోరికను బయటపెట్టారు. "దీపక్ సర్, నేను ఎన్నో హామీలను చూశాను, కానీ మీరు వాటన్నింటికంటే భిన్నం. మీరు నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి" అని హర్షవర్ధన్ రాణే అన్నారు.
{{/usCountry}}నిర్మాత పోస్ట్‌ను రీషేర్ చేసిన హర్షవర్ధన్, ఆయనపై ప్రశంసలు కురిపిస్తూనే అభిమానుల తరఫున ఒక పెద్ద కోరికను బయటపెట్టారు. "దీపక్ సర్, నేను ఎన్నో హామీలను చూశాను, కానీ మీరు వాటన్నింటికంటే భిన్నం. మీరు నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి" అని హర్షవర్ధన్ రాణే అన్నారు.
{{/usCountry}}"గతేడాది రీ-రిలీజ్ కోసం అభిమానులతో కలిసి మీ ఆఫీసు (సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్) బయట ఎలాగైతే నిలబడ్డానో, వచ్చే నెల నా పుట్టినరోజున మళ్లీ మీ గడప తడతాను. ఈసారి ఒకే ఒక్క విన్నపంతో వస్తున్నా. 'సనమ్ తేరీ కసమ్ 2' సినిమాకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. కథ, దర్శకుడు మీ ఇష్టం. నాకు, నా అభిమానులకు ఈ పుట్టినరోజు కానుకను ఇస్తారా సర్?" అని హర్షవర్ధన్ అభ్యర్థించారు.
బాక్సాఫీస్ ఫ్లాప్ నుంచి రీ-రిలీజ్ సంచలనం దాకా!
రాధికా రావు, వినయ్ సప్రూ దర్శకత్వంలో తెరకెక్కిన 'సనమ్ తేరీ కసమ్' చిత్రం తొలుత 2016 ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలైంది. ఇందులో ఇందర్ పాత్రలో హర్షవర్ధన్ రాణే, సరు పాత్రలో పాకిస్థాన్ నటి మావ్రా హొకేన్ నటించారు. అయితే ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
భారత్‌లో సుమారు రూ.8 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. కానీ ఆ తర్వాత ఓటీటీ వేదికలు, టీవీ ప్రసారాల ద్వారా యువతకు విపరీతంగా చేరువై కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
టాలీవుడ్‌లో ఊపందుకున్న రీ-రిలీజ్ ట్రెండ్ తరహాలోనే, సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత 2025 ఫిబ్రవరి 7న ఈ సినిమాను తిరిగి థియేటర్లలో విడుదల చేశారు. ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ రీ-రిలీజ్‌లో తొలిరోజే భారత్‌లో సుమారు రూ.4.25 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
సనమ్ తేరి కసమ్ రీ రిలీజ్ కలెక్షన్స్
ఫుల్ రన్‌లో దేశవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.54 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఇండియన్ సినిమా రీ-రిలీజ్ చరిత్రలోనే అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది సనమ్ తేరి కసమ్.
ఒకప్పుడు ఫ్లాప్ ముద్ర పడిన సినిమా, పట్టుదల, అభిమానుల ప్రేమతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు హీరో, నిర్మాత మధ్య కనిపిస్తున్న ఈ అనుబంధం త్వరలోనే 'సనమ్ తేరీ కసమ్ 2' పట్టాలెక్కడానికి బాటలు వేస్తుందని సినీ అభిమానులు ఆశిస్తున్నారు.