100 Cr Movies: తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు ప్రాంతీయ పరిధులను దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఒకప్పుడు సినిమా మొత్తం రన్ బేస్ మీద సాధించే రూ.100 కోట్ల మైలురాయిని, నేడు మన టాలీవుడ్ హీరోలు కేవలం ఒకే ఒక్క రోజులో ఊడ్చేస్తున్నారు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల హవా ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి తొలి రోజు కలెక్షన్లే నిదర్శనం.
పెద్దితో రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నయా రికార్డు అందుకున్నాడు. తన కెరీర్ లో సోలో హీరోగా ఫస్ట్ టైమ్ తొలి రోజే రూ.100 కోట్ల కలెక్షన్ల రికార్డును నమోదు చేశాడు. పెద్దితో సరికొత్త చరిత్ర లిఖించాడు. అయితే రామ్ చరణ్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీకి ఈ ఘనత అందుకోవడం విశేషం.
రెబల్ స్టార్ ప్రభాస్
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అత్యధిక సార్లు తొలి రోజే వంద కోట్ల మైలురాయిని దాటిన ఏకైక భారతీయ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. ఏకంగా ఆయన నటించిన 6 సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2: ది కంక్లూజన్' మొదటి రోజే దాదాపు రూ.217 కోట్ల కలెక్షన్లతో సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత వచ్చిన సుజీత్ చిత్రం 'సాహో' రూ.116 కోట్లు, ఓం రౌత్ 'ఆదిపురుష్' రూ.104.50 కోట్లు, ప్రశాంత్ నీల్ యాక్షన్ డ్రామా 'సలార్: పార్ట్ 1' రూ.143.25 కోట్లు, నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ' రూ.161.50 కోట్లకు పైగా ఫస్ట్ రోజు గ్రాస్ వసూలు చేశాయి. వీటికి తోడు 'ది రాజా సాబ్' సైతం రూ.100.90 కోట్లతో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
తన నటనతో, మాస్ ఇమేజ్‌తో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు అంతర్జాతీయంగానూ ఎన్టీఆర్ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తొలిసారి ఎన్టీఆర్ రూ.100 కోట్ల ఓపెనింగ్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా రూ.223 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.
{{/usCountry}}తన నటనతో, మాస్ ఇమేజ్‌తో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు అంతర్జాతీయంగానూ ఎన్టీఆర్ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తొలిసారి ఎన్టీఆర్ రూ.100 కోట్ల ఓపెనింగ్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం మొదటి రోజే ఏకంగా రూ.223 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది.
{{/usCountry}}కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సోలో చిత్రం 'దేవర: పార్ట్ 1' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే రూ.131.25 కోట్ల భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ సత్తాను చాటింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
'పుష్ప: ది రైజ్' చిత్రంతో దేశవ్యాప్తంగా తగ్గేదేలే అంటూ సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. దాని సీక్వెల్ 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.256.50 కోట్ల నుంచి రూ.280 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. సింగిల్ డేలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు హీరోగా అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
తనదైన మేనరిజమ్స్, అశేష అభిమాన బలంతో టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సైతం ఈ ఎలైట్ క్లబ్‌లో నిలిచాడు. సుజీత్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన 'దే కాల్ హిమ్ ఓజీ' (They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.129.25 కోట్ల నుంచి రూ.154 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించి పవర్ స్టార్ బాక్సాఫీస్ పవర్‌ను రుజువు చేసింది.
People Also Ask (FAQ)
ప్రశ్న: మొదటి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా ఏది?
జవాబు: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం మొదటి రోజే రూ.256.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.
ప్రశ్న: రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఎన్ని ఉన్నాయి?
జవాబు: ప్రభాస్ ఖాతాలో అత్యధికంగా 6 సినిమాలు (బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీ, ది రాజా సాబ్) ఉన్నాయి.
ప్రశ్న: రామ్ చరణ్ సోలో హీరోగా వంద కోట్ల ఓపెనింగ్ సాధించిన చిత్రం ఏది?
జవాబు: రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన 'పెద్ది' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.