Free Horror Thriller: తెలుగు సినీ లవర్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ ను మన ఆడియన్స్ చుస్తూనే ఉన్నారు. ఇక హారర్ థ్రిల్లర్ జోనర్, అందులోనూ తెలుగు సినిమాలకు ఉండే డిమాండ్ మామూలు కాదు. మరి అలాంటి ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమాను ఫ్రీగా చూడొచ్చని మీకు తెలుసా?
అమరావతికి ఆహ్వానం

తెలుగులో ఇటీవల వచ్చిన అమరావతికి ఆహ్వానం సినిమాను ఫ్రీగా చూడొచ్చు. అవును.. ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ ను యూట్యూబ్ లో ఉచితంగా వీక్షించొచ్చు. తెలుగు హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం ఈ ఫుల్ మూవీ ఫ్రీగా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో ఎస్తేర్, ధన్య, సుప్రీత, శివ కంఠంనేని, భద్రమ్, హరీష్ తదితరులు నటించారు.
బాక్సాఫీస్ రిజల్ట్
తెలుగులో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ అమరావతికి ఆహ్వానం మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెంచాయి. కానీ ఫిబ్రవరి 13, 2026న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. జీవీకే దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల మనసులు గెలుచుకోలేకపోయింది.
ఈ ఓటీటీలో
అమరావతికి ఆహ్వానం మూవీ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో రిలీజైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఆహా వీడియో ఓటటీలోకి వచ్చింది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఫ్రీగా చూడాలనుకునే మూవీ లవర్స్ యూట్యూబ్ ఓపెన్ చేసి సినిమా పేరు సెర్చ్ చేస్తే సరిపోతుంది.
కథ ఏమిటంటే?
అమరావతికి ఆహ్వానం సినిమా స్టోరీ ఓ రివేంజ్ హారర్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఈ సినిమాలో సీఐ ఈశ్వర్ (శివ కంఠంనేని) సస్పెన్షన్ లో ఉంటాడు. ఆయన భార్య పేరు భానుమతి (ధన్య). సస్పెండ్ అయి ఇంట్లో ఉండే సీఐ ఈశ్వర్, భానుమతితో పాటు భార్గవి కలిసి అమరావతి అనే గ్రామానికి వెళ్తారు.
{{/usCountry}}అమరావతికి ఆహ్వానం సినిమా స్టోరీ ఓ రివేంజ్ హారర్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఈ సినిమాలో సీఐ ఈశ్వర్ (శివ కంఠంనేని) సస్పెన్షన్ లో ఉంటాడు. ఆయన భార్య పేరు భానుమతి (ధన్య). సస్పెండ్ అయి ఇంట్లో ఉండే సీఐ ఈశ్వర్, భానుమతితో పాటు భార్గవి కలిసి అమరావతి అనే గ్రామానికి వెళ్తారు.
{{/usCountry}}భానుమతి (సుప్రీత) ఏమో యూట్యూబ్ లో పాపులర్ కావడం కోసం వీడియోలు చేస్తుంటుంది. ఈ ముగ్గురు కలిసి అమరావతి అనే ఊర్తో దెయ్యాలు ఉన్నాయనే విషయాన్ని నిరూపించడానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత కథ అడ్డం తిరుగుతుంది. అక్కడి జమీందార్ వారసురాలు రాజేశ్వరి (ఎస్తేర్) హత్యకు గురవుతుంది. ఆమె దెయ్యంగా మారి వస్తుంది.
అసలు రాజేశ్వరిని ఎవరు హత్య చేశారు? రాజేశ్వరి కారణంగా ఈశ్వర్, భానుమతి, భార్గవి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అదిరిపోయే క్లైమాక్స్? ఏంటీ అన్నది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.