OTT Telugu: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్.. ఒకేసారి ఆరు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్
OTT Telugu: ఓటీటీ లవర్స్ కు ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు తెలుగు హారర్ మూవీ డైరెక్ట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకేసారి రిలీజైంది.
ఓటీటీ ఆడియన్స్ కు తెలుగు హారర్ థ్రిల్లర్ ‘మారీచ’ సడెన్ సర్ ప్రైజ్ వచ్చింది. నేరుగా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఇవాళ నుంచి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మారీచ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

మారీచ ఓటీటీ
సండేను స్పెషల్ గా మారుస్తూ ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ ‘మారీచ’ వచ్చేసింది. ఇవాళ (ఏప్రిల్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.
ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో
మారీచ మూవీ ఒకేసారి ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజైంది. ప్రైమ్ వీడియోతో పాటు హంగామా ఓటీటీ, వాచో, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, టాటా ప్లే, సన్ నెక్ట్స్ లో మారీచ రిలీజైంది. అయితే ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం రెంట్ విధానంలో మాత్రమే మారీచ ప్లే అవుతుంది. అంటే సబ్ స్క్రిప్షన్ ఉన్నా కూడా ఈ సినిమాను రెంట్ పే చేసి చూడాల్సిందే.
థియేటర్ రిలీజ్
ఫస్ట్ మారీచ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో అతాన్ సంతోష్, అజామ్, సయ్యద్ గౌస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి శివాజీ, సురేష్ కలిసి దర్శకత్వం వహించారు. ఘంటసాల విశ్వనాథ్ మ్యూజిక్ డైరెక్టర్.
మారీచ స్టోరీ
మారీచ సినిమాను మిస్టరీతో కూడిన హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. యోగాపురం ఓ అందమైన పల్లెటూరు. అయితే ఆ గ్రామాన్ని ఓ దుష్టశక్తి పీడిస్తుంటుంది. దీని కారణంగా ఆ ఊర్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. జనాలు భయపడతారు.
ఆ ట్విస్ట్
అంతుచిక్కని ఆ దుష్ట శక్తి కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటాయి. అప్పుడే హీరో రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ప్రాణాలు తీస్తున్న ఆ దుష్ట శక్తి ఎవరు? దాన్ని హీరో ఎలా అంతం చేయగలిగాడు? అన్నది మారీచ సినిమాలో చూడాల్సిందే.
మొదటి ఘట్టం
మారీచ మూవీని పార్ట్ లుగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మారీచ సినిమా మొదటి ఘట్టంగా రిలీజ్ అయింది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ ఫ్రాంఛైజీలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశముంది. డైరెక్టర్లు శివాజీ, సురేష్ కు ఇదే ఫస్ట్ మూవీ కావడం గమనార్హం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


