OTT Trending: థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించి, సరికొత్త రికార్డులు సృష్టించింది స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా ఈ మూవీ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. సౌత్ ఇండియాలోనే ట్రెండింగ్ నంబర్ వన్ గా ఓటీటీని షేక్ చేస్తోంది.
మా ఇంటి బంగారం ఓటీటీ

సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం థియేటర్లలో అదరగొట్టింది. ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. థియేటర్లో అదిరే పర్ఫార్మెన్స్ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. ఈ సినిమా జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ షేక్
ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం సినిమా డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఓటీటీలో అదరగొడుతోంది. ఈ చిత్రం ఓటీటీ ప్రపంచంలో పెను సంచలనాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ సౌత్ ఇండియా డిజిటల్ మార్కెట్‌ను ఊపేస్తోంది. ఏకంగా నాలుగు భాషల్లో ట్రెండింగ్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.
నాలుగు భాషల్లో
మా ఇంటి బంగారం చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా కన్నడ, మలయాళం, తమిళ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లోనూ అత్యధిక వ్యూస్‌తో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఆయా భాషల డిజిటల్ ఆడియన్స్ కూడా మా ఇంటి బంగారం మూవీకి ఫిదా అయిపోతున్నారు.
థియేటర్లలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మహిళా ప్రధాన చిత్రంగా మా ఇంటి బంగారం చరిత్ర సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్‌ను ఇప్పుడు ఓటీటీలోనూ సౌత్ ఆడియన్స్ ఎంతో ఆస్వాదిస్తున్నారు.
ఫ్యామిలీ ఎలిమెంట్స్
{{/usCountry}}థియేటర్లలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మహిళా ప్రధాన చిత్రంగా మా ఇంటి బంగారం చరిత్ర సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్‌ను ఇప్పుడు ఓటీటీలోనూ సౌత్ ఆడియన్స్ ఎంతో ఆస్వాదిస్తున్నారు.
ఫ్యామిలీ ఎలిమెంట్స్
{{/usCountry}}కుటుంబ సెంటిమెంట్‌తో పాటు ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్ ఉండటం వల్ల మా ఇంటి బంగారం సినిమాకు అన్ని భాషల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతోంది. సమంత కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, సంతోష్ నారాయణన్ అందించిన కార్నాటిక్ రాక్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసే పోరాటం సౌత్ ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తోంది. వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా మారిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని డిజిటల్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.