OTT Trending: రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఆడియన్స్ ను ఫ్యామిలీలకు ఫ్యామిలీలు థియేటర్లకు రప్పించిన మూవీ ‘ఇరుముడి’. రవితేజ హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. వరల్డ్ వైడ్ గా నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.
ఇరుముడి ఓటీటీ

మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఇరుముడి' (Irumudi) థియేటర్లనే కాకుండా ఓటీటీలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఇరుముడి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
గ్లోబల్ నంబర్ వన్
ఇరుముడి మూవీకి ఓటీటీలోనూ అదిరిపోయే క్రేజ్ దక్కుతోంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన సెప్టెంబర్ 21-27 గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో ఇరుముడి ఏకంగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంది. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని అధిగమించి ఇరుముడి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఎంతమంది చూశారంటే?
థియేటర్లలో ఊహించని విజయాన్ని అందుకున్న రవితేజ 'ఇరుముడి' చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో వేరే లెవల్ రీతిలో వ్యూవర్‌షిప్ సాధిస్తోంది. గత వారంలో గ్లోబల్ చాట్‌లో మూడో స్థానంలో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు ఏకంగా నంబర్ వన్ పొజిషన్ కు వచ్చింది.
సెప్టెంబర్ 21 నుంచి 27వ తేదీ వరకు ఇరుముడి సినిమాకు ఓటీటీలో 34 లక్షల వ్యూస్ దక్కాయి. ఈ వ్యూస్ తో ఇరుముడి టాప్ ప్లేసుకు చేరుకుంది. మొత్తం 81 లక్షల గంటల పాటు ఈ మూవీని చూశారు. గత వారం మొదటి స్థానంలో నిలిచిన సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రాన్ని కిందకు నెట్టి 'ఇరుముడి' అగ్రపీఠాన్ని దక్కించుకోవడం విశేషం.
బ్లాక్ బస్టర్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఇరుముడి చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, శివ నిర్వాణ భావోద్వేగపూరితమైన కథనం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి.
{{/usCountry}}మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించిన ఇరుముడి చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, శివ నిర్వాణ భావోద్వేగపూరితమైన కథనం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించాయి.
{{/usCountry}}ఇరుముడి సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. థ్రిల్, సస్పెన్స్ కూడా ఉంది. ముఖ్యంగా తండ్రీకూతురు బంధం, ఆఖర్లో హత్య ఎవరు చేశారనే ట్విస్ట్ సినిమాకు వెన్నెముకలా నిలిచాయి. కేవలం ఒకే ఫార్ములాకు పరిమితం కాకుండా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఈ ఇరుముడి సినిమాను శివ నిర్వాణా తెరకెక్కించారు.