Jiohotstar OTT: జియోహాట్‌స్టార్ యూజర్స్ కు గుడ్ న్యూస్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తెలుగు సైకో కిల్లర్ థ్రిల్లర్ మూవీ ‘మయూఖ’ ఇవాళ నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసింది.
మయూఖ ఓటీటీ

తెలుగులో తెరకెక్కిన మయూఖ సినిమా సైకలాజికల్ సస్పెన్స్ మిస్టరీ అంశాలతో రూపొందింది. ఈ సినిమా నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇప్పుడీ మూవీ రెండో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇవాళ (నవంబర్ 22) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయిదు భాషల్లో
సైకో కిల్లర్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన మయూఖ మూవీ జియోహాట్‌స్టార్‌లో అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మయూఖ సండే స్పెషల్ గా వచ్చేసింది.
స్టోరీ ఏంటంటే?
ఒంటరి మహిళలను హత్య చేసి, వాళ్ల శవాలని కాల్చి పర్ఫ్యూమ్ రెడీ చేసే సైకో కిల్లర్ కథతో మయూఖ మూవీ తెరకెక్కింది. మయూఖ ఓ బ్యాంక్ ఎంప్లాయ్. ఒంటరిగా ప్లాట్ లో ఉంటుంది. అయితే తన చిన్నప్పుడు ఓ దారుణ సంఘటన జరుగుతుంది. దీంతో మయూఖ భయపడుతూనే ఉంటుంది.
తన అపార్ట్ మెంట్ లో ఎవరో ఉన్నారని, తన పక్కన రాత్రి పడుకుంటున్నారని మయూఖ భయపడుతుంది. ఈ విషయంపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తుంది. అదే సమయంలో మయూఖ ప్లాట్ లో ఓ మర్డర్ జరుగుతుంది.
మరోవైపు సైకో కిల్లర్ ఏమో ఒంటరి అమ్మాయిలను వరుసగా చంపుతుంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతను మయూఖను చంపాడా? ఈ సినిమాలో బిగ్ బాస్ అమన్ రోల్ ఏంటీ? అనేది మయూఖ చిత్రంలో చూడాల్సిందే.
మలయాళం సినిమాలా
{{/usCountry}}మరోవైపు సైకో కిల్లర్ ఏమో ఒంటరి అమ్మాయిలను వరుసగా చంపుతుంటాడు. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు? అతను మయూఖను చంపాడా? ఈ సినిమాలో బిగ్ బాస్ అమన్ రోల్ ఏంటీ? అనేది మయూఖ చిత్రంలో చూడాల్సిందే.
మలయాళం సినిమాలా
{{/usCountry}}మయూఖ మూవీ మలయాళం థ్రిల్లర్ సినిమాలా ఉందనే టాక్ వినిపిస్తోంది. నెమ్మదిగా మూవీ స్టార్ట్ అయి.. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేరే లెవల్ లో సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో పాయల్ చెంగప్ప, అభిలాష్ అడ్డ, చరిష్మా, మురళీధర్ గౌడ్, బిగ్ బాస్ అమన్ తదితరులు నటించారు.
మయూఖ సినిమాకు శ్రీతేజ్ డైరెక్టర్. డిఫరెంట్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకునేవాళ్లకు ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో మయూఖ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు లేటు మరి వెంటనే ఈ సైకో కిల్లర్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేసేయండి.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.