Thalapathy Vijay Bodyguard Aroon Suresh Post: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని అధికార పీఠం దిశగా నడిపించిన దళపతి విజయ్‌కు అడుగుడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పెట్టిన నిబంధనలు 'దళపతి'ని టెన్షన్‌లో పెట్టాయి.
అయితే, శుక్రవారం (మే 8) నాటి తాజా పరిణామాల ప్రకారం వీసీకే (VCK), సీపీఐ(ఎం), సీపీఐ పార్టీల మద్దతుతో దళపతి విజయ్ మెజారిటీని సాధించి, ముఖ్యమంత్రి పీఠం కోసం తన బలాన్ని నిరూపించుకున్నారు.
బాడీగార్డ్ పోస్ట్ వెనుక అర్థం ఇదేనా?
ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు, మ్యాజిక్ ఫిగర్ కోసం దళపతి విజయ్ కొట్టుమిట్టాడుతున్న వేళ హీరో విజయ్ బాడీగార్డ్ అరూన్ సురేష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశమైంది. "కఠినమైన పోరాటాల తర్వాతే అందమైన ఫలితాలు వస్తాయి.. ధైర్యంగా ఉండండి, అంతా మంచే జరుగుతుంది" అని విజయ్ బాడీగార్డ్ రాసుకొచ్చారు.
గతంలో విజయ్ వ్యక్తిగత జీవితంపై, హీరోయిన్ త్రిషతో ఉన్న సంబంధంపై పుకార్లు వచ్చినప్పుడు కూడా అరూన్ ఇలాగే రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ గందరగోళం సమయంలోనూ ఆయన పెట్టిన పోస్ట్ విజయ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
కష్టాల కడలి దాటి..
విజయ్ రాజకీయ అరంగేట్రం పూలబాటలా ఏమీ సాగలేదు. ఆయన ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు సామాన్యమైనవి కావు:
ర్యాలీలో విషాదం: కరూరులో జరిగిన ఒక సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోవడం విజయ్‌ను తీవ్రంగా కలిచివేసింది.
{{/usCountry}}ర్యాలీలో విషాదం: కరూరులో జరిగిన ఒక సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోవడం విజయ్‌ను తీవ్రంగా కలిచివేసింది.
{{/usCountry}}సినిమాపై దెబ్బ: ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన 'జన నాయగన్' చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ రాకపోవడం, కోర్టుకెళ్లినా ఫలితం లేకపోవడం టీవీకే శ్రేణులను ఇబ్బంది పెట్టింది. పైగా ఎన్నికల ముందే ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం మరో పెద్ద ఎదురుదెబ్బ.
వ్యక్తిగత విమర్శలు: విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు, మరో నటితో ఎఫైర్ ఉందనే ఆరోపణలు రాజకీయంగా ఆయనను ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకున్నారు.
నిరూపించుకున్న విజయ్!
గవర్నర్ ఆదేశాల మేరకు మేజిక్ నంబర్ కోసం దళపతి విజయ్ తీవ్రంగా శ్రమించారు. తొలుత కాంగ్రెస్‌తో జతకట్టినప్పటికీ ఐదు సీట్ల లోటు ఉండేది. అయితే శుక్రవారం నాటికి వామపక్ష పార్టీలు, వీసీకే విజయ్‌కు జై కొట్టడంతో సంఖ్యాబలం దక్కింది.
ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టిన దళపతి విజయ్, ఈ అడ్డంకులన్నీ అధిగమించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది వేచి చూడాలి. సినీ గ్లామర్‌తో వచ్చిన విజయ్, రాజకీయాల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే ఆసక్తి నెలకొంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. విజయ్ పార్టీకి ఏ పార్టీలు మద్దతు ప్రకటించాయి?
తొలుత కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా, తాజాగా మెజారిటీ నిరూపించుకోవడానికి వీసీకే (VCK), సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు విజయ్‌కు మద్దతు తెలిపాయి.
2. విజయ్ సినిమా 'జన నాయగన్' ఎందుకు విడుదల కాలేదు?
సీబీఎఫ్‌సీ (CBFC) ఈ చిత్రానికి సర్టిఫికేషన్ ఇవ్వకుండా రివైజింగ్ కమిటీకి పంపింది. తదుపరి కోర్టులో కూడా ఊరట లభించకపోవడంతో విడుదల నిలిచిపోయింది.
3. విజయ్ బాడీగార్డ్ అరూన్ సురేష్ పెట్టిన పోస్ట్ ఏమిటి?
"కష్టతరమైన యుద్ధాల తర్వాతే గొప్ప విజయాలు లభిస్తాయి, అందరూ ధైర్యంగా ఉండండి" అని అరూన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
4. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌ను ఏమి అడిగారు?
అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పత్రాన్ని (Majority List) సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు.