Jana Nayagan Aired In Local Cable Channel: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే పాలిటిక్స్‌లోకి వెళ్లేముందు దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతోపాటు వివాదాలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

అయితే, జన నాయగన్ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) నుంచి ఇంకా క్లియరెన్స్ రాకముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. అంతటితో ఆగకుండా, తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక స్థానిక కేబుల్ ఛానెల్ జన నాయగన్ సినిమాను అక్రమంగా ప్రసారం చేయడం తాజాగా తీవ్ర దుమారం రేపింది. 'రాశి ప్రైమ్ మూవీ' అనే లోకల్ ఛానెల్‌లో ఏప్రిల్ 11న జన నాయగన్ సినిమాను టెలికాస్ట్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. అరెస్టులు
ఈ అక్రమ ప్రసారంపై విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) కోయంబత్తూరు తూర్పు విభాగం డిప్యూటీ సెక్రటరీ మోహనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన కోయంబత్తూరు ఎస్పీ కె. కార్తికేయన్, నిందితులను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన కరుమత్తంపట్టి పోలీసులు, ఛానెల్ యజమాని ఎస్. పళనిస్వామి (44)ని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఈ క్రమంలో జన నాయగన్ అక్రమ ప్రసారానికి వాడిన కంప్యూటర్లు, ఐదు హార్డ్ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఛానెల్ కార్యాలయాన్ని కూడా సీజ్ చేశారు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి సినిమాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
లీక్ వెనుక రాజకీయ కుట్ర ఉందా?
గత వారమే 'జన నాయగన్' చిత్రం ఆన్‌లైన్ సైట్లలో ప్రత్యక్షమైంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ఇప్పటికే న్యాయపరమైన చర్యలు చేపట్టింది. అక్రమంగా జన నాయగన్ సినిమాను డౌన్ లోడ్ చేయవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని అభిమానులను కోరింది.
{{/usCountry}}గత వారమే 'జన నాయగన్' చిత్రం ఆన్‌లైన్ సైట్లలో ప్రత్యక్షమైంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ఇప్పటికే న్యాయపరమైన చర్యలు చేపట్టింది. అక్రమంగా జన నాయగన్ సినిమాను డౌన్ లోడ్ చేయవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని అభిమానులను కోరింది.
{{/usCountry}}సైబర్ క్రైమ్ విభాగం ఈ లీకేజీకి సంబంధించి ఇప్పటికే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్లే జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే అక్రమంగా ఫుటేజీని సేకరించి లీక్ చేయడం వెనుక పెద్ద ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం?
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ జన నాయగన్ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు ఇతర కీలక పాత్రలు పోషించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దళపతి విజయ్ సిద్ధమవుతున్న తరుణంలో, ఆయన ఇమేజ్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి లీకులకు పాల్పడుతున్నారా అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది.
ఈ అడ్డంకులన్నీ దాటుకుని జన నాయగన్ సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందా అని దళపతి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి.