OTT Today: ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ సిరీస్ ఫైనల్ సీజన్- సూపర్ హీరోల ముసుగులో ఆకృత్యాలు- తెలుగుతో సహా 6 భాషల్లో!

The Boys Final Season OTT Release Today Telugu: ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ సిరీస్ ది బాయ్స్ ఫైనల్ సీజన్ స్ట్రీమింగ్ కానుంది. సూపర్ హీరోలపై సెటైర్లు, ఆ ముసుగులో వారు చేసే ఆకృత్యాల చుట్టూ సాగుతుంది ఈ సిరీస్. తెలుగుతో సహా ఆరు భాషల్లో ది బాయ్స్ 5 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అదెక్కడో లుక్కేద్దాం.

Published on: Apr 8, 2026, 05:48:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెలల తరబడి నిరీక్షణకు తెరపడనుంది. సూపర్ హీరోల ముసుగులో సాగే అకృత్యాలను, వెన్నులో వణుకు పుట్టించే మలుపులను ఓటీటీ తెరపై ఆవిష్కరించిన ది బాయ్స్ సిరీస్ ఇప్పుడు తన ఆఖరి అంకానికి చేరుకుంది. ఐదో సీజన్‌తో ఈ ది బాయ్స్ సాగా ముగియనుంది. ఈసారి పోరు మునుపటి కంటే మరింత తీవ్రంగా, రక్తపాతంతో కూడి ఉండబోతోందని చిత్ర యూనిట్ ఇప్పటికే హింట్ ఇచ్చింది.

ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ సిరీస్ ఫైనల్ సీజన్- సూపర్ హీరోల ముసుగులో ఆకృత్యాలు- తెలుగుతో సహా 6 భాషల్లో!
ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ సిరీస్ ఫైనల్ సీజన్- సూపర్ హీరోల ముసుగులో ఆకృత్యాలు- తెలుగుతో సహా 6 భాషల్లో!

ఓటీటీ సూపర్ హిట్ సిరీస్

ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్‌లలో ది బాయ్స్ ఒకటి. సైన్స్ ఫిక్షన్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ది బాయ్స్ నుంచి ఫైనల్ సీజన్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 8) మరికాసేపట్లో స్ట్రీమింగ్ కానుంది. సూపర్ హీరోలపై సెటైర్లు, వాళ్లను చంపేందుకు తిరిగే మరో ముఠా వంటి అంశాలతో ఈ సిరీస్ బాగా పేరు తెచ్చుకుంది.

ఈ ఆఖరి సీజన్‌లో ఏం జరగబోతోంది?

ది బాయ్స్ సీజన్ 5 అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగనుంది. హోమ్‌ల్యాండర్ తన వింతైన, స్వార్థపూరితమైన ధోరణితో అరాచకం సృష్టిస్తుంటే.. హ్యూగీ, మదర్స్ మిల్క్, ఫ్రెంచీలు 'ఫ్రీడమ్ క్యాంప్'లో చిక్కుకుపోతారు. మరోవైపు, యానీ (స్టార్‌లైట్) సూపర్ హీరోల శక్తులను ఎదిరించలేక సతమతమవుతుంటుంది. ఇక కిమికో ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.

అలాగే, బిల్లీ బుచర్ విషయానికి వస్తే.. సూపర్ హీరోలందరినీ తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న ఒక వైరస్‌తో అతను తిరిగి వస్తాడు. ఇది ప్రపంచం గమనాన్ని మార్చేస్తుంది. బుచర్ పాత్ర పోషించిన కార్ల్ అర్బన్ మాట్లాడుతూ, "ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే మీరు షాక్ అవుతారు. ఎవరూ సురక్షితం కాదు, మొదటి నుంచే మరణాలు మొదలవుతాయి. ఇదొక క్లైమాక్స్ రైడ్" అని పేర్కొన్నారు.

మరో విశేషమేమిటంటే, 'సూపర్ నేచురల్' సిరీస్ స్టార్స్ జారెడ్ పడలెక్కి, మిషా కాలిన్స్ ఈ సీజన్‌లో జెన్సన్ ఎకిల్స్‌తో కలిసి ఒక అద్భుతమైన సీన్‌లో కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం ఓటీటీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని జెన్సన్ ఎకిల్స్ తెలిపారు.

మరికాసేపట్లో ఓటీటీలోకి

ది బాయ్స్ 5లో ఆంటోనీ స్టార్ (హోమ్‌ల్యాండర్), ఎరిన్ మోరియార్టీ (స్టార్‌లైట్), జాక్ క్వాయిడ్ (హ్యూగీ), కార్ల్ అర్బన్ (బిల్లీ బుచర్), జెన్సన్ ఎకిల్స్ (సోల్జర్ బాయ్) వంటి ప్రధాన తారాగణం మళ్లీ అలరించనుంది. ఇక మరికాసేపట్లో ది బాయ్స్ 5 ఓటీటీలోకి వచ్చేయనుంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ది బాయ్స్ ఫైనల్ సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి ఆరు భాషల్లో ది బాయ్స్ 5 ఓటీటీ రిలీజ్ కానుంది. ఇండియాలో ఇవాళ (ఏప్రిల్ 8, 2026) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ది బాయ్స్ సీజన్ 5 అందుబాటులోకి రానుంది.

మునుపటి సీజన్ల తరహాలోనే, మొదటి రోజున రెండు ఎపిసోడ్లు నేరుగా ఓటీటీలో విడుదలవుతాయి. ఆ తర్వాత మే 20న జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి బుధవారం ది బాయ్స్ 5 సిరీస్ నుంచి ఒక కొత్త ఎపిసోడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు ఈ సిరీస్‌ను నేరుగా చూడవచ్చు. కొత్త వినియోగదారులు 30 రోజుల ఉచిత ట్రయల్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఎపిసోడ్ల షెడ్యూల్ ఇలా ఉంది:

ఎపిసోడ్ 1, 2: ఏప్రిల్ 8

ఎపిసోడ్ 3: ఏప్రిల్ 15

ఎపిసోడ్ 4: ఏప్రిల్ 22

ఎపిసోడ్ 5: ఏప్రిల్ 29

ఎపిసోడ్ 6: మే 6

ఎపిసోడ్ 7: మే 13

ఎపిసోడ్ 8 (ముగింపు): మే 20

నిరాశ పడాల్సిన అవసరం లేదు

ఐదో సీజన్‌తో ది బాయ్స్ సిరీస్ ముగిసినప్పటికీ, అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన స్పిన్-ఆఫ్స్ 'జెన్ వి' (Gen V), అడల్ట్ యానిమేటెడ్ సిరీస్ 'ది బాయ్స్ ప్రెజెంట్స్: డయాబోలికల్' ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. అంతేకాకుండా, 'వాట్ రైజింగ్' (Vought Rising) అనే మరో ప్రీక్వెల్ కూడా త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More