మనోజ్ బాజ్‌పేయ్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మూడవ సీజన్ రికార్డులు తిరగరాస్తోంది. నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ భారీ సక్సెస్ అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సిరీస్ 35కు పైగా దేశాలలో టాప్-5లో ట్రెండ్ అయింది. ఇంకా ఇతర రికార్డులూ ఖాతాలో వేసుకుంది.
ఓటీటీ ట్రెండింగ్ లో

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రికార్డులు బద్దలు కొట్టింది. నాలుగు సంవత్సరాలకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత ఈ ప్రజాదరణ పొందిన షో మూడవ సీజన్ నవంబర్ 21న విడుదలైంది. తొలి వారంలో 'ది ఫ్యామిలీ మ్యాన్' భారతదేశంలోని 96% జిల్లాలలో అందుబాటులోకి వచ్చింది. మరోవైపు యుకె, ఆస్ట్రేలియా, కెనడా, యుఎఇ, సింగపూర్, మలేషియా వంటి 35కు పైగా దేశాలలో టాప్ 5 ట్రెండ్‌లలో ఒకటిగా నిలిచిందని వెరైటీ నివేదించింది. 2019, 2021లో విడుదలైన మునుపటి రెండు సీజన్‌ల రికార్డులను అధిగమించిన సీజన్ 3 ఓటీటీలో అదరగొడుతోంది.
అత్యధిక వీక్షణలు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రైమ్ వీడియో ఇండియాలో తొలి వారంలోనే 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3.. 2025లో అత్యధికంగా వీక్షించిన సిరీస్ గా రికార్డు సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన ఇతర సిరీస్ లను అన్నింటినీ ఇది అధిగమించింది.
సమంత భర్త
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమంత రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేలో రాజ్ నిడిమోరు ఒకరు. ఈ సిరీస్ సృష్టికర్తలు, దర్శకులు, రచయితలు అయిన రాజ్ & డికె నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3కి లభించిన అద్భుతమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అద్భుతమైన ఆదరణ
{{/usCountry}}టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమంత రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకుంది. డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లాడింది. ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకేలో రాజ్ నిడిమోరు ఒకరు. ఈ సిరీస్ సృష్టికర్తలు, దర్శకులు, రచయితలు అయిన రాజ్ & డికె నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3కి లభించిన అద్భుతమైన స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
అద్భుతమైన ఆదరణ
{{/usCountry}}ప్రైమ్ వీడియో ఇండియాలో ఒరిజినల్స్ డైరెక్టర్, హెడ్ అయిన నిఖిల్ మధోక్ కూడా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశాడుు. 'ఉత్కంఠభరితమైన కథ, అసాధారణమైన నటన, రాజ్, డికె సిగ్నేచర్ విచిత్రం, వారి విభిన్న కథన శైలి, గుండె వేగాన్ని పెంచే థ్రిల్స్‌తో కలిసి ఈ సిరీస్ ప్రేక్షకుల అభిమానంగా మారడానికి కారణమయ్యాయని' వెరైటీ మధోక్‌ను ఉటంకించింది.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 3 గురించి..
ఈ ఫ్రాంచైజీ తాజా ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనోజ్ బాజ్‌పేయ్ శ్రీకాంత్ తివారీగా తిరిగి వచ్చాడు. ఈ సీజన్‌లో ప్రధాన విలన్ రుక్మాగా జైదీప్ అహ్లావత్ నటించాడు. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో శాంతి చర్చలు విఫలమవ్వడానికి గల కారణాలను ఛేదించే బాధ్యత తివారీకి అప్పగిస్తారు. అయితే తన ప్రేయసి మరణానికి తివారీనే బాధ్యుడని రుక్మా నమ్ముతాడు. దీంతో తివారీ కుటుంబంపై తీవ్రమైన దాడి జరుగుతుంది.
బాజ్‌పేయ్, అహ్లావత్‌తో పాటు ఈ మూడవ సీజన్‌లో నిమ్రత్ కౌర్, అలాగే షరీబ్ హష్మీ, ప్రియమణి, అశేషా ఠాకూర్, వేదాంత్ సిన్హా, శ్రేయ ధన్వంతరీ, గుల్ పనాగ్ తదితరులు కూడా నటించారు.