Christopher Nolan: ఆ సినిమా తీయాలంటే మాత్రం నాకు చచ్చేంత భయం: లెజెండరీ డైరెక్టర్ నోలన్‌ను వణికించే ఆ జానర్ ఏదో తెలుసా?

Christopher Nolan: ది ఒడిస్సీలాంటి దృశ్య కావ్యాన్ని అందించిన లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్.. తనకు రొమాంటిక్ కామెడీ జానర్ అంటే మాత్రం చచ్చేంత భయం అని చెప్పడం విశేషం. ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడే తాను.. డైరెక్షన్ మాత్రం చేయనని అంటున్నాడు.

Published on: Jul 25, 2026, 08:07:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Christopher Nolan: హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) తన లేటెస్ట్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. టైమ్ ట్రావెల్, స్పేస్, సైన్స్ ఫిక్షన్, ఎపిక్ మైథాలజీ కథలను మైండ్ బ్లాకింగ్ విజువల్ గ్రాండ్‌నెస్‌తో తెరకెక్కించే నోలన్.. తనను తీవ్రంగా భయపెట్టే ఒకే ఒక్క సినీ జానర్ గురించి ఓపెన్ అయ్యారు. 'ది టునైట్ స్టారింగ్ జిమ్మీ ఫాలన్' టాక్ షోలో పాల్గొన్న ఆయన.. రొమాంటిక్ కామెడీ సినిమా తీయాలంటే తనకు చాలా భయం అని అంగీకరించారు.

Christopher Nolan: ఆ సినిమా తీయాలంటే మాత్రం నాకు చచ్చేంత భయం: లెజెండరీ డైరెక్టర్ నోలన్‌ను వణికించే ఆ జానర్ ఏదో తెలుసా?
Christopher Nolan: ఆ సినిమా తీయాలంటే మాత్రం నాకు చచ్చేంత భయం: లెజెండరీ డైరెక్టర్ నోలన్‌ను వణికించే ఆ జానర్ ఏదో తెలుసా?

"కామెడీ సినిమా తీస్తే దాక్కోవడానికి చోటుండదు!"

జిమ్మీ ఫాలన్ టాక్ షోలో సరదాగా రొమాంటిక్ కామెడీ సినిమాల గురించి చర్చ వచ్చినప్పుడు నోలన్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. "నాకు పర్సనల్‌గా రొమాంటిక్ కామెడీ సినిమాలు చూడటం చాలా ఇష్టం. కానీ అలాంటి సినిమా డైరెక్ట్ చేయడం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. థియేటర్‌లో కూర్చున్న జనాలను నవ్వించడం అనేది డైరెక్టర్‌కు చాలా రిస్కీ జాబ్" అని నోలన్ వివరించారు.

తన సైన్స్ ఫిక్షన్ లేదా ఎపిక్ సినిమాల్లో సీన్లు కొన్నింటిని ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోకపోతే 'వాళ్లకు కథాంశం సరిగ్గా కనెక్ట్ కాలేదులే' అని తప్పించుకునే వెసులుబాటు తనకు ఉంటుందని ఆయన నవ్వుతూ చెప్పారు. కానీ కామెడీ విషయంలో అలా దాక్కోవడానికి ఏమీ ఉండదని, థియేటర్‌లో జనాలు నవ్వకపోతే ఆ సీన్ అట్టర్‌ఫ్లాప్ అని వెంటనే తేలిపోతుందని అన్నారు. అందుకే రొమాంటిక్ కామెడీ సినిమా తీయాలంటే తనకు విపరీతమైన భయమని వ్యాఖ్యానించారు.

ది ఒడిస్సీ గ్రాండ్ సక్సెస్

రొమాంటిక్ కామెడీ తీయడానికి భయపడే నోలన్.. గ్రీక్ పురాణాల ఆధారంగా హోమర్ రాసిన 'ది ఒడిస్సీ' కావ్యాన్ని తెరకెక్కించడంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. దాదాపు రూ. 2,400 కోట్ల (250 మిలియన్ డాలర్లు) పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ విజువల్ ఎపిక్ కోసం 6 దేశాల్లో 91 రోజుల పాటు రికార్డు స్థాయిలో షూటింగ్ చేశారు.

స్కాట్లాండ్‌లోని మోరే ఫిర్త్ కోస్ట్‌తో పాటు అనేక రియల్ లొకేషన్లలో ఐమాక్స్ (IMAX) కెమెరాలతో రికార్డ్ స్థాయిలో 20 లక్షల అడుగుల రీల్‌ను వాడి ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. అంతేకాకుండా విజువల్ ఎఫెక్ట్స్ సహజంగా ఉండటం కోసం 60 అడుగుల భారీ అనిమేట్రానిక్ పప్పెట్‌ను ఉపయోగించి హాలీవుడ్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచారు.

మ్యాట్ డామన్ కాళ్ల గాయాలు.. టామ్ హాలండ్ భయాలు!

ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్‌లో ఎదురైన చిత్రమైన అనుభవాలను నటీనటులు పంచుకున్నారు. మెయిన్ లీడ్ పోషించిన మ్యాట్ డామన్ (Matt Damon) మాట్లాడుతూ.. గ్రీక్ హీరోగా రోజంతా చెప్పులు వేసుకుని రాళ్లపై తిరగడం వల్ల కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయని, వీపు నొప్పితో నరకం చూశానని చెప్పారు.

ఇక టెలిమాకస్ పాత్రలో నటించిన యంగ్ స్టార్ టామ్ హాలండ్ కు ఐమాక్స్ కెమెరాలతో పనిచేయడం ఇదే తొలిసారి. ఐమాక్స్ కెమెరా రీల్ రోల్ కేవలం 3 నిమిషాలు మాత్రమే నడుస్తుందనే విషయం తెలియక, నోలన్ పదే పదే కట్ చెప్తుంటే తన యాక్టింగ్ నచ్చకనే అలా చేస్తున్నారేమోనని విపరీతంగా భయపడిపోయానని టామ్ హాలండ్ వెల్లడించారు.

నెక్స్ట్ హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారా?

'ద ఒడిస్సీ' గ్రాండ్ సక్సెస్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా ఒక ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రొమాంటిక్ కామెడీలకు ఆమడ దూరంలో ఉండే ఈ విజనరీ డైరెక్టర్.. హారర్ జానర్‌లో ఎలాంటి విజువల్ మ్యాజిక్ చేస్తారో చూడాలని వరల్డ్ సినిమా లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More