...
...
Next Story

The Paradise Collection: 7 రోజులు, 154 కోట్ల కలెక్షన్స్- నాని ది ప్యారడైజ్ హిట్ అయ్యేందుకు ఇంకెన్ని కోట్లు రావాలంటే?

Nani The Paradise Box Office Collection Day 7: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'ది ప్యారడైజ్' చిత్రం తొలి వారంలోనే ఇండియాలో రూ.100 కోట్ల మైలురాయిని దాటింది. 7 రోజుల్లో 154 కోట్లు రాబట్టిన ది ప్యారడైజ్ సినిమా హిట్ కొట్టేందుకు ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 1, 2026, 11:50:42 IST
Advertisement

Nani The Paradise 7 Days Worldwide Box Office Collection: నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. 'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన చేసిన రెండో చిత్రం 'ది ప్యారడైజ్' థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

విడుదలైన మొదటి వారంలోనే

7 రోజులు, 154 కోట్ల కలెక్షన్స్- నాని ది ప్యారడైజ్ హిట్ అయ్యేందుకు ఇంకెన్ని కోట్లు రావాలంటే?
7 రోజులు, 154 కోట్ల కలెక్షన్స్- నాని ది ప్యారడైజ్ హిట్ అయ్యేందుకు ఇంకెన్ని కోట్లు రావాలంటే?

విడుదలైన మొదటి వారంలోనే ది ప్యారడైజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తోలి రోజు నుంచి టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

తొలి వారంలో వసూళ్ల సునామీ..

ప్రసిద్ధ ట్రేడ్ విశ్లేషణ సంస్థ నివేదిక ప్రకారం, బుధవారం (సెప్టెంబర్ 30) రోజున భారత్‌లో ది ప్యారడైజ్ సినిమా రూ.3.40 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దేశీయంగా ఇప్పటివరకు అంటే, ఏడు రోజుల్లో మొత్తం రూ. 104.90 కోట్ల కలెక్షన్లను ది ప్యారడైజ్ సినిమా సొంతం చేసుకుంది.

ఒక్కరోజే 5 వేల 411 షోలు, 17.74 శాతం ఆక్యుపెన్సీ

అలాగే, వారం రోజుల్లో ఇండియాలో ది ప్యారడైజ్ సినిమాకు రూ. 123.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్‌గా రూ. 154.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 7 రోజుల్లో రూ. 30.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. బుధవారం రోజున దేశవ్యాప్తంగా 5,411 షోలలో 17.74 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదైంది.

ది ప్యారడైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్

అయితే, ది ప్యారడైజ్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా సుమారు రూ. 200 నుంచి 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ లెక్కన ది ప్యారడైజ్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 50 నుంచి 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావాలి. అంటే, రూ. 220 కోట్లు దాటితేనే ఈ సినిమా హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇలాగే వసూళ్లు కంటిన్యూ అయితే ఇంకో 5 రోజుల్లో ఈ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

భారీ కలెక్షన్స్

'ది ప్యారడైజ్' సాధించిన విజయం నాని సినీ ప్రస్థానంలోనే ఒక మైలురాయిగా మారింది. గతంలో ఆయన నటించిన 'దసరా' (రూ.81.93 కోట్లు), 'హిట్: ది థర్డ్ కేస్' (రూ.80.97 కోట్లు), 'సరిపోదా శనివారం' (రూ.63.21 కోట్లు) చిత్రాల కలెక్షన్లను ఇది అధిగమించింది.

చిరు, రామ్ చరణ్, ప్రభాస్ సినిమాల సరసన

టాలీవుడ్‌లో ఇటీవల భారీ విజయం సాధించిన 'పెద్ది' (రూ.244.64 కోట్లు), 'మన శంకర వరప్రసాద్ గారు' (రూ.218.47 కోట్లు), 'ఇరుముడి' (రూ.192.82 కోట్లు), 'ది రాజా సాబ్' (రూ.146.04 కోట్లు) సరసన నిలిచేందుకు ది ప్యారడైజ్ చిత్రం పోటీపడుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks