...
...
Next Story

The Paradise OTT Cuts: ఓటీటీలో మొదలైన జడల్ జమానా.. కానీ ది ప్యారడైజ్ స్ట్రీమింగ్ లో ట్విస్ట్.. ఏ సీన్లు కట్ చేశారంటే?

The Paradise OTT Cuts: నాని ఫ్యాన్స్, ఓటీటీ లవర్స్ కు ఫుల్ కిక్ ఇస్తూ ది ప్యారడైజ్ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే థియేటర్లో ప్యారడైజ్ చూసిన ఆడియన్స్.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలో కొన్ని మార్పులు చూసి షాక్ అవుతున్నారు. మరి ఓటీటీ కోసం మేకర్స్ ఏం ఛేంజ్ చేశారో ఇక్కడ చూసేయండి.

Published on: Oct 22, 2026, 13:41:37 IST
Advertisement

The Paradise OTT Cuts: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' ఇవాళ (అక్టోబర్ 22) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అయింది. థియేటర్లలో విడుదలైన కేవలం నాలుగు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీ వీక్షకుల ముందుకు వచ్చేసింది.

ది ప్యారడైజ్ ఓటీటీ

ఓటీటీలో మొదలైన  జడల్ జమానా.. కానీ ది ప్యారడైజ్ స్ట్రీమింగ్ లో ట్విస్ట్.. ఏ సీన్లు కట్ చేశారంటే? (x/SLVCinemasOffl)
ఓటీటీలో మొదలైన జడల్ జమానా.. కానీ ది ప్యారడైజ్ స్ట్రీమింగ్ లో ట్విస్ట్.. ఏ సీన్లు కట్ చేశారంటే? (x/SLVCinemasOffl)

ది ప్యారడైజ్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో మేకర్స్ కొన్ని కీలక మార్పులు చేయడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.

ఓటీటీ కోసం మార్పులు

ఓటీటీ ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేయడం కోసం ది ప్యారడైజ్ ఓటీటీ వర్షన్ ను రెడీ చేశారు. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ‘ధూమవతి’ ఫైట్ ఎపిసోడ్ పై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ప్యారడైజ్ మూవీలో ఈ ఫైట్ ఎపిసోడ్ ను ఎడిట్ చేశారు.

ధూమవతి ఎపిసోడ్ లో వచ్చే హీరో తల్లి డ్యాన్స్ పార్ట్ మొత్తాన్ని డిలీట్ చేశారు. దీంతో మూవీ రన్ టైమ్ తగ్గింది. కానీ దాన్ని కవర్ చేసేందుకు ఎండ్ క్రెడిట్స్ స్పీడ్ ను తగ్గించారు. థియేటర్లో ఈ ఎండ్ క్రెడిట్స్ స్పీడ్ గా వెళ్లిపోయాయనే కామెంట్లు వినిపించాయి. ఇక ఓటీటీలోని ది ప్యారడైజ్ మూవీలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ ను కూడా బెటర్ చేశారు.

రా అండ్ రస్టిక్

ది ప్యారడైజ్ మూవీలో నానికి జోడీగా కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఇక అగ్ర నటుడు మోహన్ బాబు విలన్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. రాఘవ్ జుయల్ కూడా సత్తాచాటాలి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks