...
...
Next Story

OTT Super Hero: ఓటీటీలోకి మొరటు హీరో యాక్షన్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- ఉనికి కోసం ఆఖరి పోరాటం, ఆ సినిమాకు గైడ్‌లా!

The Punisher One Last Kill OTT Streaming: ఓటీటీలోకి సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. 8.4 రేటింగ్ ఉన్న ది పనిషర్ సిరీస్ నుంచి వన్ లాస్ట్ కిల్ అనే స్పెషల్ ప్రజంటేషన్ కింద మూవీగా మార్వెల్ తీసుకొస్తుంది. మరి ఈ ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: May 11, 2026, 09:41:14 IST
Advertisement

The Punisher One Last Kill OTT Release: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మొరటు హీరో ఫ్రాంక్ కాజిల్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జాన్ బెర్న్‌తాల్ ప్రధాన పాత్రలో నటించిన 'ది పనీషర్: వన్ లాస్ట్ కిల్'. ఇది సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీలోకి మే 12న అంటే రేపే స్ట్రీమింగ్ కానుంది.

ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీ రిలీజ్

ఓటీటీలోకి మొరటు హీరో యాక్షన్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- ఉనికి కోసం ఆఖరి పోరాటం, ఆ సినిమాకు గైడ్‌లా!
ఓటీటీలోకి మొరటు హీరో యాక్షన్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- ఉనికి కోసం ఆఖరి పోరాటం, ఆ సినిమాకు గైడ్‌లా!

ఇది మార్వెల్ నుంచి వస్తోన్న స్పెషల్ ప్రజెంటేషన్. మినీ సినిమాగా గంటపాటు రన్‌టైమ్‌తో ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, ఇది కేవలం మరో కథ మాత్రమే కాదు, రాబోయే 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమాలో పనీషర్ ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఒక కీలకమైన మలుపుగా మారనుంది. ది పనీషర్ సిరీస్‌కు ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్ ఉంది.

ఫ్యాన్స్ కోసం ప్రత్యేక హబ్

జియో హాట్‌స్టార్‌లో ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రేక్షకుల సౌకర్యార్థం డిస్నీ ప్లస్ ఒక సరికొత్త 'పనీషర్ హబ్'ను రూపొందించింది. ఇందులో పనీషర్ పాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ సీజన్లు, డేర్ డెవిల్ ఎపిసోడ్లు, త్వరలో రానున్న 'డేర్ డెవిల్: బోర్న్ అగైన్'కు సంబంధించిన కంటెంట్ అంతా ఒకే చోట లభిస్తుంది.

"ఫ్రాంక్ కాజిల్ ప్రయాణాన్ని వరుస క్రమంలో (కాలానికి తగిన సీక్వెన్స్ ప్రకారం) అర్థం చేసుకోవడానికి ఈ హబ్ ఎంతో ఉపయోగపడుతుంది" అని మార్వెల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ సినిమాతో పనీషర్ కథ ఎలా కలవనుందో తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక గైడ్‌లా పనిచేస్తుంది.

ప్రతీకారం దాటిన పోరాటం

'ది పనీషర్: వన్ లాస్ట్ కిల్' మే 12, 2026న రాత్రి 9 గంటలకు (ET) ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్ కానుంది. భారతదేశంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అంటే జియో హాట్‌స్టార్ వేదికగా దీనిని వీక్షించవచ్చు. ఇది కేవలం జియో హాట్‌స్టార్ ఓటీటీలో మాత్రమే అందుబాటులో ఉంటుంది తప్ప, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కనిపించదు.

ఈ స్పెషల్ ప్రజెంటేషన్ ది పనీషర్ వన్ లాస్ట్ కిల్ ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా వీధి స్థాయి పోరాట వీరులను (Street level heroes) నేరుగా స్పైడర్ మ్యాన్ వంటి పెద్ద సూపర్ హీరోల కథలతో అనుసంధానం చేయాలని మార్వెల్ భావిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks