బాక్సాఫీస్ దగ్గర ది రాజా సాబ్ కలెక్షన్ల బండి మెల్లగా సాగుతోంది. బలమైన ఓపెనింగ్ వసూళ్లు తర్వాత ఈ మూవీ జోరు కాస్త తగ్గింది. ఈ హారర్ థ్రిల్లర్ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే అఖండ 2, మిరాయ్ లైఫ్ టైమ్ కలెక్షన్లనూ దాటింది.
ది రాజా సాబ్ కలెక్షన్లు

ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ రిలీజైంది. బంపర్ స్టార్ట్ తర్వాత బాక్సాఫీస్ వద్ద రాజా సాబ్ కాస్త స్లో అయింది. ఈ చిత్రం దాని ఓపెనింగ్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగారూ. 150 కోట్ల వసూళ్లను దాటింది. ఇది సంక్రాంతి నాటికి రూ.200 కోట్ల మార్కును దాటుతుందని భావిస్తున్నారు.
రూ.158 కోట్లు
రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర మూడు రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ది రాజా సాబ్ దాని ప్రారంభ రోజు, శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు సంపాదించింది. అయితే శనివారం ఈ చిత్రం విదేశాలలో క్రాష్ అయింది. ఇండియాలో 51% తగ్గుదలను నమోదు చేసింది. ఆదివారం (జనవరి 11) దేశీయ వసూళ్లు మరో 20 శాతం తగ్గాయి. ఆదివారం నాటికి ది రాజా సాబ్ ఇండియాలో రూ.109 కోట్ల నెట్ (రూ.130 కోట్ల గ్రాస్) అందుకుంది.
ఓవర్సీస్ లో ఇలా
ఓవర్సీస్ లో రాజా సాబ్ మూడు రోజుల్లో కలిపి $ 3 మిలియన్లకు పైగా సంపాదించింది. దీంతో మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.158 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ఈ మూవీ ఇటీవల విడుదలైన అనేక పెద్ద తెలుగు సినిమాలను దాటేసింది.
{{/usCountry}}ఓవర్సీస్ లో రాజా సాబ్ మూడు రోజుల్లో కలిపి $ 3 మిలియన్లకు పైగా సంపాదించింది. దీంతో మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ.158 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ఈ మూవీ ఇటీవల విడుదలైన అనేక పెద్ద తెలుగు సినిమాలను దాటేసింది.
{{/usCountry}}నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 బాక్సాఫీస్ వద్ద రూ.128 కోట్లకు పైగా వసూలు చేసింది. మరోవైపు తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ రూ.150 కోట్లను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రాజా సాబ్ మూడు రోజుల్లోనే ఈ సినిమాలను దాటేసింది.
రాజా సాబ్ గురించి
మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేసిన మూవీ ది రాజా సాబ్. ప్రభాస్ కెరీర్ లో ఇది ఫస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్. చాలా కాలం తర్వాత రెబల్ స్టార్ కామెడీ, డ్యాన్స్ తో ఇరగదీశాడు. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్ తదితరులు నటించారు. ఈ చిత్రం విమర్శకుల నుండి ఎక్కువగా ప్రతికూల సమీక్షలు అందుకుంది.