ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అంచనాలు అందుకోలేకపోయింది. డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఇవాళ (ఫిబ్రవరి 6) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన రాజాసాబ్ ఓటీటీని షేక్ చేస్తోంది.
రాజాసాబ్ ఓటీటీ

ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా శుక్రవారం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రాజాసాబ్ మూవీ ఓటీటీ లవర్స్ కు అందుబాటులో ఉంది. ఈ సినిమాకు అదనపు సీన్లు యాడ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ లో
రాజాసాబ్ మూవీ ఇలా ఓటీటీలోకి వచ్చిందో లేదో అలా ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. అర్ధరాత్రి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచే ఫ్యాన్స్ ఈ మూవీని ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ మూవీ జియోహాట్‌స్టార్ లో తెలుగు ట్రెండింగ్ లో ఇండియాలో సెకండ్ ప్లేస్ కు వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్ లో మలయాళం హారర్ థ్రిల్లర్ సర్వం మాయ ఉంది.
థియేటర్ రెస్పాన్స్
సంక్రాంతి 2026 సందర్భంగా రాజాసాబ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. జనవరి 9న ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ స్క్రీన్ల మీదకు వచ్చేసింది. భారీ అంచనాల నేపథ్యంలో మూవీకి సాలిడ్ ఓపెనింగ్స్ దక్కాయి. ఫస్ట్ రోజే రూ.100 కోట్ల కలెక్షన్లు ఖాతాలో చేరాయి. కానీ ఆ తర్వాత మిక్స్ డ్ టాక్ కారణంగా వసూళ్లు దారుణంగా పడిపోయాయి. చివరకు రూ.200 కోట్లు దాటిన తర్వాత ఆగిపోయాయి. సినిమా బడ్జెట్ రూ.400 కోట్ల ప్రకారం చూస్తే రాజాసాబ్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.
రాజాసాబ్ స్టోరీ
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు. తన నానమ్మ కోసం తాతయ్యను వెతికి తీసుకొద్దామని హీరో అనుకుంటాడు. కానీ తాత ట్రాప్ లో పడి ఓ రాజ మహల్ కు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక హీరోకు చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
{{/usCountry}}రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు. తన నానమ్మ కోసం తాతయ్యను వెతికి తీసుకొద్దామని హీరో అనుకుంటాడు. కానీ తాత ట్రాప్ లో పడి ఓ రాజ మహల్ కు వెళ్తాడు. అక్కడికి వెళ్లాక హీరోకు చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
{{/usCountry}}రాజ్ మహల్ లోని పరిస్థితులు హీరోను భయపెడతాయి. ప్రాణాలను ప్రమాదంలోకి నెడతాయి. మరి హీరోకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అతని గతం ఏంటీ? నానమ్మ కోరిక ఏంటీ? అన్నది రాజాసాబ్ మూవీలో చూడాల్సందే.