...
...
Next Story

OTT Release: ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లోకి మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్ట్‌లతో తెలుగులోనూ స్ట్రీమింగ్!

OTT Release: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఇవాళ ఓ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. డేంజరస్ గేమ్స్, మైండ్ బ్లోయింగ్ చేసే ట్విస్ట్ లతో ఈ సిరీస్ సాగుతుంది. థ్రిల్లర్ లవర్స్ కు ఫుల్ కిక్ అందించే ఈ సిరీస్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Oct 13, 2026, 08:44:02 IST
Advertisement

OTT Release: నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ట్రాప్' (The Trap) ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఇవాళ (అక్టోబర్ 13) ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన Dear Child మేకర్స్ రూపొందించిన ఈ సిరీస్.. ప్రముఖ రచయిత్రి మెలానీ రాబే రాసిన బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా తెరకెక్కింది.

స్టోరీ ఏంటంటే?

ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లోకి మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్ట్‌లతో తెలుగులోనూ స్ట్రీమింగ్!
ఇవాళ నెట్‌ఫ్లిక్స్‌లోకి మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్ట్‌లతో తెలుగులోనూ స్ట్రీమింగ్!

నెట్‌ఫ్లిక్స్‌లోని ది ట్రాప్ వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ కథ లీసా కాన్రాడ్ అనే ప్రసిద్ధ రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. పదేళ్ల క్రితం ఆమె కళ్ల ముందే సొంత సోదరి అన్నా దారుణ హత్యకు గురవుతుంది. ఆ భయంకరమైన గతాన్ని మర్చిపోలేక, అగోరాఫోబియాతో (Agoraphobia) బాధపడుతూ పదేళ్లుగా ఇంటి గడప దాటకుండా లీసా ఒంటరిగా జీవిస్తుంటుంది.

అయితే ఒక రోజు టీవీ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో కనిపించిన ఓ జర్నలిస్ట్‌ను చూసి, అతడే తన సోదరిని చంపిన హంతకుడని లీసా బలంగా నమ్ముతుంది. పోలీసులను ఆశ్రయించకుండా, అతడిని బయటకు రప్పించేందుకు ఓ ప్రమాదకరమైన ఎత్తుగడ వేస్తుంది. ఆ హత్య వివరాలతో కూడిన పుస్తకాన్ని రాసి, తననే ఎరగా వాడుతూ ఒక డేంజరస్ మైండ్ గేమ్ ప్లాన్ చేస్తుంది.

మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు

ఈ వెబ్ సిరీస్ ది ట్రాప్ కథలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేస్తాయి. ప్రారంభంలో లీసా హంతకుడిని ట్రాప్ చేస్తోందని భావిస్తారు, కానీ కథ సాగేకొద్దీ అసలు ఉచ్చులో పడింది ఎవరనే సస్పెన్స్ మొదలవుతుంది. చనిపోయిన సోదరి అన్నా అసలు స్వభావం, లీసా జ్ఞాపకాల్లోని లోపాలు క్రమంగా బయటపడుతూ ప్రేక్షకుడి ఊహలను తలకిందులు చేస్తాయి. చివరి నిమిషం వరకు నేరస్థుడు ఎవరనే అంశంపై దర్శకురాలు మెయింటైన్ చేసిన క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్రతి క్షణం ఉత్కంఠను రేపుతుంది.

ఎపిసోడ్లు, రన్ టైమ్

గ్లోబల్ ఆడియన్స్‌తో పాటు ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ది ట్రాప్ సిరీస్‌ను ఒరిజినల్ జర్మన్ ఆడియోతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల డబ్బింగ్ ఆడియో, సబ్‌టైటిల్స్‌తో నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా తమ సొంత భాషలోనే ఈ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

పర్ఫెక్ట్ ఛాయిస్

ఇక నటీనటుల విషయానికి వస్తే లీసా కాన్రాడ్‌గా ఫ్రెడరికే బెచ్ట్, జర్నలిస్ట్ రాబర్ట్ లెంజెన్‌గా హాన్స్ లోవ్ అద్భుత నటనను కనబరిచారు. మథియాస్ బ్రాండ్, మిరియమ్ ఓల్మేయర్, జోసెఫిన్ థీసెన్, మలయా స్టెర్న్ తకేడా ఇతర కీలక పాత్రల్లో నటించగా ఇసాబెల్ క్లీఫెల్డ్ అద్భుతమైన దర్శకత్వ ప్రతిభను కనబరిచారు. సైకలాజికల్ థ్రిల్లర్లు, క్రైమ్ మిస్టరీలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌కు ఈ సిరీస్ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks