వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాను సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు.
కామెడీ బాగుందంటూ

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ రోజు నుంచే మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది ఈ సినిమా. ముఖ్యంగా మూవీలో కామెడీ బాగుందంటూ ప్రశంసలు దక్కించుకుంది ఈ సినిమా.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనను రాబట్టుకుంటోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నార్త్ అమెరికాలో మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దూసుకుపోతోంది.
అమెరికా, కెనడాలో
నార్త్ అమెరికాలో చిన్న చిత్రం సాధించిన మైల్ స్టోన్ ఇది అంటూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవర్ సీస్‌లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ విడుదల చేశారు. వారి ప్లానింగ్, రీచ్‌తో ఈ సినిమాను అమెరికా, కెనడాలోని ప్రేక్షకులకు చేరవేయటంలో కీలక పాత్రను పోషించాయి.
ఇక నార్త్ అమెరికాలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా 100K డాలర్స్ కి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇది సింపుల్‌గా, ఆశ్చర్యకరంగా అనిపించే అరుదైన విజయం అని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.
మెమోరీ కార్డ్ మర్చిపోతే
{{/usCountry}}ఇక నార్త్ అమెరికాలో విడుదలైన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా 100K డాలర్స్ కి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇది సింపుల్‌గా, ఆశ్చర్యకరంగా అనిపించే అరుదైన విజయం అని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.
మెమోరీ కార్డ్ మర్చిపోతే
{{/usCountry}}ఇకపోతే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ కథ విషయానికొస్తే.. చిన్న పట్నంలో ఉండే రమేష్ (తిరువీర్) అనే ఫొటోగ్రాఫర్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేసినప్పుడు మెమొరీ కార్డుని కోల్పోతాడు. దాని కారణంగా ఏర్పడే గందరగోళమైన పరిస్థితులతో నడిచే కథతో సినిమాను తెరకెక్కించారు.
మనం రోజు మన చుట్టూ ఉన్న వారిలో చూసే కామెడీ, ఆప్యాయత వంటి కోణాలను అతిశయోక్తిగా కాకుండా మనకు కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని చిత్రీకరించారు. సన్నివేశాల్లోని కామెడీ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారనే అంశాలను సహజంగా చూపించారని పలు రివ్యూస్ వచ్చాయి.
ఓవర్‌సీస్‌లో విజయవంతంగా
మనసుల జీవితాల్లోని డ్రామా, కామెడీ, భావోద్వేగాల్లోని నిజాయతీ కలయికగా రూపొందిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఏదో మిస్ అయ్యామని భావించే ప్రేక్షకులు కోరుకునే అంశాలను సహజంగా అందించిందంటూ తెలిపారు.
విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా క్రమంగా ప్రేక్షకుల ఆదరణను కూడా పొందుతూ ఓవర్‌సీస్‌లో విజయవంతంగా రన్ అవుతోంది. నార్త్ అమెరికాలోని ఆడియెన్స్‌కు సినిమా బాగా కనెక్ట్ అవుతోంది. భారీ స్పెషల్ ఎఫెక్ట్స్, భారీతనంతోనే కాకుండా నిజాయతీ, నైపుణ్యంతో మంచి కథ ఉంటే చాలని మరోసారి ఈ సినిమా నిరూపించింది.