...
...
Next Story

Top OTT Release: జైలర్ 2 నుంచి రణబాలి వరకు.. ఈ వారం ఓటీటీలో మిస్ అవకూడని టాప్ సినిమాలు ఇవే.. ఇది కదా పండగంటే!

Top OTT Release: ఇది కదా అసలైన ఓటీటీ పండగ అంటే! ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాల జోరు మామూలుగా లేదు. అన్ని జోనర్లలో, టాప్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం క్యూ కట్టాయి. ఇందులో జైలర్ 2 నుంచి రణబాలి వరకు క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో చూడాల్సిన టాప్ సినిమాలపై ఓ లుక్కేయండి.

Published on: Nov 10, 2026, 12:03:48 IST
Advertisement

Top OTT Release: తెలుగు సూపర్ హిట్స్ నుంచి తమిళ బ్లాక్ బస్టర్ వరకూ.. అదిరిపోయే మలయాళం థ్రిల్లర్ల నుంచి హిందీ సినిమాల వరకూ.. ఈ వారం ఓటీటీలోకి క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. పాపులర్ జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో తదితర ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇవి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

జైలర్ 2 ఓటీటీ

జైలర్ 2 నుంచి రణబాలి వరకు.. ఈ వారం ఓటీటీలో మిస్ అవకూడని టాప్ సినిమాలు ఇవే.. ఇది కదా పండగంటే!
జైలర్ 2 నుంచి రణబాలి వరకు.. ఈ వారం ఓటీటీలో మిస్ అవకూడని టాప్ సినిమాలు ఇవే.. ఇది కదా పండగంటే!

ఈ వారం అన్ని సినిమాలు, సిరీస్ ల కంటే కూడా డిజిటల్ ఆడియన్స్ ఎక్కువ ఎగ్జైటింగ్ గా చూడటానికి వెయిట్ చేస్తున్న మూవీ ‘జైలర్ 2’ అని చెప్పొచ్చు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

రణబాలి

ఇక ఈ వీక్ ఓటీటీలోకి రాబోతున్న మరో టాప్ మూవీ ‘రణబాలి’. రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాత కలిసి నటించిన ఫస్ట్ మూవీ ఇది. ఇదో పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థియేటర్లలో పర్వాలేదనిపించిన ఈ సినిమా నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రానుంది.

హ్యాపీ జర్నీ

రణబాలితో పాటు ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్, సునయన తదితరులు నటించిన ఈ సినిమా డిఫరెంట్ జనరేషన్స్ కు చెందిన మహిళల యూరప్ ట్రిప్ చుట్టూ సాగుతుంది. ఈ సినిమా నవంబర్ 13న సన్ నెక్స్ట్ లో అడుగుపెట్టనుంది.

దయారా

ఓటీటీలో మలయాళం థ్రిల్లర్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఈ వారం కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కొన్ని మలయాళం సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాయి. బాంద్రా మూవీ ఏమో నవంబర్ 13న జీ5లో, ది థర్డ్ మర్డర్ ఏమో అదే రోజున మనోరమా మ్యాక్స్, సింప్లీ సౌత్ లోకి రాబోతున్నాయి.

ఈ వెబ్ సిరీస్ లు కూడా

ఈ వారం ఓటీటీలో టాప్ సినిమాలే కాదు అదిరిపోయే థ్రిల్ అందించే వెబ్ సిరీస్ లూ రాబోతున్నాయి. అలాంటివే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’, ‘పుష్పక విమానం’ సిరీస్ లు. ఈ రెండు వెబ్ సిరీస్ లు జియోహాట్‌స్టార్ లోకి రాబోతున్నాయి. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన పుష్పక విమానం నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కరణ్ జోహార్ నుంచి వచ్చే డార్క్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఏమో నవంబర్ 13న ఓటీటీలో అడుగుపెడుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks