OTT: ఈ వారం ఓటీటీలో స్పెషల్ సినిమాలు-ధనుష్ రొమాంటిక్ డ్రామా నుంచి శోభితా క్రైమ్ థ్రిల్లర్ వరకు-వీకెండ్‌కు బెస్ట్

రిపబ్లిక్ డే హాలీడే కారణంగా ఈ సారి లాంగ్ వీకెండ్ వచ్చేస్తోంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ 5, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సూపర్ హిట్ సినిమాలతో రెడీ అయ్యాయి. మరి ఇంకెందుకు లేటు ఈ వీకెండ్ లో చూడాల్సిన స్పెషల్ మూవీస్ పై లుక్కేయండి. 

Published on: Jan 23, 2026, 15:26:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లాంగ్ వీకెండ్ వచ్చేస్తోంది. మరి ఓటీటీ లవర్స్ ఇంకెందుకు లేటు. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన లేటెస్ట్ మూవీస్ పై ఓ లుక్కేయండి. వీకెండ్ కు చూడాల్సిన స్పెషల్ సినిమాల లిస్ట్ ఇక్కడుంది. వీకెండ్ ను ఈ మూవీస్ తో ఎంజాయ్ చేయండి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ 5, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వారం హిట్ చిత్రాలను చూడండి.

వీకెండ్ ఓటీటీ సినిమాలు
వీకెండ్ ఓటీటీ సినిమాలు

తేరే ఇష్క్ మే

తమిళ స్టార్ హీరో ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో ఇది అమర కావ్యం పేరుతో థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకున్న ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జవనరి 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది శంకర్, ముక్తిల రొమాంటిక్ లవ్ స్టోరీ.

గుస్తాఖ్ ఇష్క్

ఒక గురువు నుండి కవిత్వం నేర్చుకున్న ఒక వ్యక్తి, అతని కూతురితో ప్రేమలో పడతాడు. ఈ కథతో తెరకెక్కిన లవ్ ఫీల్ గుడ్ మూవీ గుస్తాఖ్ ఇష్క్. ఇది కళ, కోరిక, విధేయత చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్, షరీబ్ హష్మీ తదితరులు నటించారు. ఈ మూవీ జనవరి 23న జియోహాట్‌స్టార్ లో రిలీజైంది.

మస్తీ 4

బాలీవుడ్ సూపర్ హిట్ బోల్డ్ రొమాంటిక్ మూవీ ఫ్రాంఛైజీ మస్తీ. ఇందులో భాగంగా లేటెస్ట్ గా వచ్చిన సినిమా మస్తీ 4. ఇందులో కామెడీతో పాటు అడల్ట్, బోల్డ్ సీన్లు కూడా ఉంటాయి. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్, ఆఫ్తాబ్ శివదాసని, వివేక్ ఒబెరాయ్ తదితరులు నటించారు. ఇది జనవరి 23 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

చీకటిలో

అక్కినేని ఇంటి కోడలు శోభితా ధూళిపాళ లీడ్ రోల్ ప్లే చేసిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో. ఇది నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. అమ్మాయిలను చీకట్లో చంపే సీరియల్ కిల్లర్ స్టోరీగా చీకటిలో తెరకెక్కింది. ఇందులో హీరోయిన్ తన పాడ్ కాస్ట్ లో ఈ క్రైమ్స్ గురించి బయటపెడుతుంది. కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో శోభితా ధూళిపాళ, విశ్వదేవ్ రచ్చకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా తదితరులు నటించారు. జనవరి 23న ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది.

మార్క్

'మార్క్', ఒక మలయాళం కాప్-థ్రిల్లర్. కిడ్నాపైన్ పిల్లల మిస్టరీని ఛేదించేందుకు వెతుకుతున్న ఎస్పీ అజయ్ మార్కండేయ చుట్టూ మూవీ కథ తిరుగుతుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా సూపర్ కాప్, ఒక నీచుడైన రాజకీయ నాయకుడు, అతని గూండాల మధ్య పోరాటాన్ని చూపుతుంది. కిచ్చా సుదీప్, గురు సోమసుందరం, నవీన్ చంద్ర, యోగి బాబు తదితరులు నటించిన ఈ మూవీ జనవరి 23న జియోహాట్‌స్టార్ లో విడుదలైంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More