ఓటీటీలో కొత్త వారం సందడి కాస్త తగ్గింది. ముఖ్యంగా తెలుగులో పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన మొత్తం సినిమాలు కూడా తక్కువే. ఈ వీక్ లో ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో ఈ మూడు కాస్త స్పెషల్ గా ఉన్నాయి. మరి ఈ చిత్రాలు ఏంటో ఓ సారి చూసేయండి.
మోగ్లీ ఓటీటీ

సుమ కనకాల, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన సినిమా మోగ్లీ. హీరోగా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న రోషన్ చేసిన రెండో మూవీ ఇది. గతంలో బబుల్ గమ్ అని ఓ రొమాంటిక్ మూవీ చేశాడు. ఇప్పుడు మోగ్లీ అంటూ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకుని హిట్ గా నిలిచింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మోగ్లీ స్టోరీ
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటించిన మోగ్లీకి కలర్ ఫొటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్టర్. అడవి బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీ ఇది. మురళీ కృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్) ఓ అనాథ. ఎస్సై కావాలనుకుంటాడు. ఊరి పక్కనే ఉన్న అడవిలో ఉంటాడు. షూటింగ్ ల కోసం వచ్చే సినిమావాళ్లకు హెల్ప్ చేసి డబ్బులు తీసుకుంటాడు. ఓ మూవీకి డ్యాన్సర్ గా వచ్చిన జాస్మిన్ (సాక్షి)ను చూసి లవ్ లో పడతాడు. కానీ మధ్యలో ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్) విలన్ లా వస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మూవీలో చూడాల్సిందే.
బ్యూటీ ఓటీటీ
టీవీలో వచ్చిన తర్వాత ఓటీటీలో అడుగుపెట్టిన తెలుగు రొమాంటిక్ మూవీ బ్యూటీ. ఇది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి కూడా ఒకరు. ఇందులో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకీ తదితరులు నటించారు.
{{/usCountry}}టీవీలో వచ్చిన తర్వాత ఓటీటీలో అడుగుపెట్టిన తెలుగు రొమాంటిక్ మూవీ బ్యూటీ. ఇది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రొడ్యూసర్లలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి కూడా ఒకరు. ఇందులో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకీ తదితరులు నటించారు.
{{/usCountry}}క్యాబ్ డ్రైవర్ గా పని చేసుకునే ఓ తండ్రి తన కూతురిని ప్రాణంగా పెంచుకుంటాడు. కానీ పెట్ ట్రైనర్ గా పనిచేసే హీరోతో లవ్ లో పడి ఆమె వెళ్లిపోతుంది. మరోవైపు రౌడీ గ్యాంగ్ వీళ్ల వెంటపడుతుంది. మరి ఆ తండ్రి తన కూతురిని తిరిగి కలిశాడా? అన్నది బ్యూటీ స్టోరీ.
డ్రైవ్ ఓటీటీ
ఆది పినిశెట్టి లీడ్ రోల్ ప్లే చేసిన క్రైమ్ థ్రిల్లర్ డ్రైవ్. ఇది ప్రైమ్ వీడియోలో ఉంది. డ్రైవ్ మూవీలో ఆది పినిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాజా చెంబోలు, కమల్ కామరాజు తదితరులు నటించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. జయదేవ్ రెడ్డి (ఆది) ఓ మీడియా దిగ్గజం.
జయదేవ్ ఓ గ్రూప్ తో రహస్య ఒప్పందం చేసుకుని ఫ్యామిలీతో లండన్ వెళ్లిపోవాలని అనుకుంటాడు. కానీ ఓ హ్యాకర్ ఇదంతా బయటపెడతాడు. మరి ఆ హ్యాకర్ ఎవరు? అనేది తెలియాలంటే డ్రైవ్ మూవీ చూడాల్సిందే.