ఓటీటీలో డిఫరెంట్ జోనర్లలో వేర్వేరు భాషల సినిమాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఓటీటీల డిమాండ్ ఎక్కువయ్యాక ఇతర భాషల సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ఈ తమిళ సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. ఇందులో హారర్, రొమాంటిక్ థ్రిల్లర్లున్నాయి. మరి వెంటనే వీటిపై ఓ లుక్కేయండి.
శబ్దం ఓటీటీ

ఓటీటీలోకి ఏడాది తర్వాత వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం తమిళంలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి అరివళగన్ డైరెక్టర్. 2025 ఫిబ్రవరిలో థియేటర్లో రిలీజైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది.
స్టోరీ ఏంటంటే?
మున్నార్ లోని మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా కాలేజీ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఓ ఘోష్ట్ ఇన్వెస్టిగేటర్ గా వైద్య లింగం (ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. అక్కడ 42 ఆత్మలు ఉన్నట్లు కనిపెడతాడు. మరి ఆ ఆత్మల కథ ఏంటీ? అన్నది శబ్దం సినిమాలో చూడాల్సిందే.
మాయాబింబం ఓటీటీ
మాయాబింబం అనేది తమిళ రొమాంటిక్ థ్రిల్లర్. ఇది జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఈ హిట్ సినిమా ప్రస్తుతం సన్ నెక్ట్స్ ఓటీటీలో ఉంది.
మాయాబింబం సినిమాలో ఆకాష్ నటరాజన్, జానకి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి కేజే సురేందర్ డైరెక్టర్. 2005లో జరిగే లవ్ స్టోరీగా మాయాబింబం సినిమా తెరకెక్కింది.
మలయాళంలో ఇలా
{{/usCountry}}మాయాబింబం సినిమాలో ఆకాష్ నటరాజన్, జానకి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి కేజే సురేందర్ డైరెక్టర్. 2005లో జరిగే లవ్ స్టోరీగా మాయాబింబం సినిమా తెరకెక్కింది.
మలయాళంలో ఇలా
{{/usCountry}}మరోవైపు మలయాళం సినిమాలు కూడా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘మస్తిష్క మరణం’, క్రైమ్ థ్రిల్లర్ ‘వలతు వశాతే కల్లన్’ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతున్నాయి.
వర్చువల్ రియాలిటీకి, రియాలిటీకి మధ్య తేడా తెలుసుకోవడం కన్ఫ్యూజ్ అయ్యే ఓ తండ్రి కథతో మస్తిష్క మరణం మూవీ సాగుతుంది. ఇక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వలతు వశాతే కల్లన్ లో ట్విస్ట్ లు అదిరిపోయాయి. ఇంకెందుకు లేటు ఈ వీకెండ్ కు ఈ తమిళ్, మలయాళం మూవీస్ పై ఓ లుక్కేయండి.