ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో డిఫరెంట్ జానర్ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఇందులో క్రైమ్ థ్రిల్లర్, కామెడీ డ్రామాలున్నాయి. హే బల్‌వంత్ నుంచి మృత్యుంజయ్ వరకు ఈ వారం ఓటీటీలో చూసేయండి.
హే బల్‌వంత్ ఓటీటీ

తెలుగులో రీసెంట్ గా వచ్చిన మూవీ హే బల్‌వంత్. ఇందులో సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా నటించారు. తండ్రి బిజినెస్ ను టేకప్ చేసే కొడుకుగా సుహాస్ ఇందులో నవ్వులు పూయించాడు. ఆ సీక్రెట్ బిజినెస్ ఏంటో తెలుసుకుని హీరో షాక్ అవుతాడు. ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. జీ5 తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
మృత్యుంజయ్ ఓటీటీ
శ్రీ విష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ్. రీసెంట్ గా థియేటర్లలో ఈ మూవీ అదరగొట్టింది. ఏప్రిల్ 3న ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్‌లో జరిగే వరుస అనుమానాస్పద మరణాల చుట్టూ సాగే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది.
ఒక మార్కెటింగ్ ఉద్యోగి ప్రాణాలకు తెగించి సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మరో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఇది ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులో శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నమయ్య జిల్లా కొత్తపేట నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక పంచాయితీ కార్యదర్శి విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు.
{{/usCountry}}ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మరో తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఇది ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఇందులో శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నమయ్య జిల్లా కొత్తపేట నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక పంచాయితీ కార్యదర్శి విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు.
{{/usCountry}}తన ఇంట్లో చనిపోయి ఉన్న ఎస్ఐ మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆ కార్యదర్శి కుటుంబం చేసే ప్రయత్నాలు కామెడీతో పాటు థ్రిల్ పంచుతాయి.
యూఫోరియా
డ్రగ్స్ మత్తులో యూత్ ఎలా మునిగిపోయిందనే స్టోరీ లైన్ తో తెరకెక్కిన సినిమా యూఫోరియా. ఇది ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. భూమిక చావ్లా, సారా అర్జున్ నటించిన ఈ సినిమా 2022లో జూబ్లీహిల్స్‌లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది.
ఒక పార్టీలో ఐదుగురు యువకులు డ్రగ్స్ తీసుకుంటారు. మత్తులో ఓ అమ్మాయిని రేప్ చేస్తారు. న్యాయం కోసం ఆ అమ్మాయి ఎలా పోరాడింది? ఇందులో భూమిక క్యారెక్టర్ ఏంటీ? అన్నది ఓటీటీలో చూడాల్సిందే.