ఓటీటీలో ఈ వారం డిఫరెంట్ జోనర్లలోని సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. అయితే ఇందులో తెలుగులో రిలీజైన కొన్ని మూవీస్, ఓ సిరీస్ ఓటీటీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన వాటిల్లో వీటిని మాత్రం అసలు మిస్సవొద్దు. మరి ఆ సినిమాలు, సిరీస్ ఏంటో ఇక్కడ చూసేయండి.
అఖండ 2

నందమూరి బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించిన సినిమా అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హైప్ ను అందుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అఖండ 2 తాండవం. ఇప్పుడు ఇండియాలో నంబర్ టూగా ట్రెండ్ అవుతోంది ఈ మూవీ.
కానిస్టేబుల్ కనకం సీజన్ 2
ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు రిలీజ్ లు గురించి చెప్పుకోవాలంటే ముందుగా ఈ సిరీస్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. అదే కానిస్టేబుల్ కనకం సీజన్ 2. బ్లాక్ బస్టర్ హిట్ అయిన సీజన్ 1ను మించేలా ఈ సీజన్ 2లో ట్విస్ట్ లున్నాయి. వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ ఈటీవీ విన్ లో అందుబాటులో ఉంది.
జిగ్రీస్
సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కామెంట్లతో ఒక్కసారిగా వైరల్ గా మారిన మూవీ జిగ్రీస్. దీనికి రవి ఎన్.పి. డైరెక్టర్. ఈ మూవీ సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. వీళ్ల మధ్యలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయన్నదే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్టోరీ.
సైలెంట్ స్క్రీమ్స్
{{/usCountry}}సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కామెంట్లతో ఒక్కసారిగా వైరల్ గా మారిన మూవీ జిగ్రీస్. దీనికి రవి ఎన్.పి. డైరెక్టర్. ఈ మూవీ సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉంటారు. వీళ్ల మధ్యలోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయన్నదే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ స్టోరీ.
సైలెంట్ స్క్రీమ్స్
{{/usCountry}}ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మరో తెలుగు సినిమా ‘సైలెంట్ స్క్రీమ్స్- ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ’. ఇదో మిస్టరీ థ్రిల్లర్. తక్కువ పాత్రలతో తెరకెక్కిన క్రైమ్ డాక్యుమెంటరీ ఇది. సమాజంలో అన్యాయానికి, లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిల ఎలా రివేంజ్ తీర్చుకున్నారన్నది ఈ మూవీలో చూపించారు. ఇది సన్ నెక్ట్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
అందెలరవమిది
సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ స్వచ్ఛమైన ప్రేమ కథగా తెరకెక్కిన మూవీ అందెలరవమిది. మ్యూజిక్ అంటే ఇష్టం ఉండే అమ్మాయి, అబ్బాయి మధ్య లవ్ స్టోరీనే ఈ మూవీ. ఇది ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.