సంక్రాంతి సందర్బంగా థియేటర్లో సినిమాల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ సినిమాలతో థియేటర్లు నిండిపోతున్నాయి. ఇక ఓటీటీలోని పండగ జోష్ ను మరింత పెంచేందుకు చిత్రాలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు క్రేజీ మలయాళం సినిమాలు ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ ను మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చనున్నాయి. అవే కాలమ్ కావల్, భా భా బా. ఈ రెండు ఒకే రోజు ఓటీటీలోకి వస్తున్నాయ
కాలమ్ కావల్ ఓటీటీ

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ కాలమ్ కావల్. ఇందులో మమ్ముట్టితో పాటు వినాయనక్ కీలక పాత్ర పోషించాడు. ఈ మలయాళ థ్రిల్లర్ జనవరి 16న ఓటీటీలోకి వస్తుంది. సోనీ లివ్ లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కాలమ్ కావల్ స్ట్రీమింగ్ కానుంది.
కాలమ్ కావల్ స్టోరీ
కాలమ్ కావల్ మూవీ కైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనికి జితిన్ కే జోస్ డైరెక్టర్. ఇందులో మమ్ముట్టి సైకో కిల్లర్ గా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. సైనేడ్ మోహన్ అనే సీరియల్ కిల్లర్ జీవిక కథ ఆధారంగా ఈ మూవీ రూపొందించినట్లు తెలిసింది. కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని గ్రామాల్లో మహిళలు వరుసగా హత్యలకు గురవుతారు. ఈ హత్యలు చేసే సీరియల్ కిిల్లర్ ఎవరు? అనేది ఉత్కంఠ పంచుతుంది.
భా భా బా ఓటీటీ
మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో కనిపించిన మరో మలయాళం సినిమా భా భా బా. ఇందులో దిలీప్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ సినిమా జనవరి 16న జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇదో మలయాళం యాక్షన్ కామెడీ మూవీ. దీనికి ధనంజయ్ శంకర్ డైెరెక్టర్.
భా భా బా స్టోరీ
వెరైటీ టైటిల్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది భా భా బా మూవీ. కానీ థియేటర్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. కేరళ సీఎం సీకే జోసఫ్ ను కామనర్ అనే ఓ రౌడీ కిడ్నాప్ చేస్తాడు.
{{/usCountry}}వెరైటీ టైటిల్ తోనే ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది భా భా బా మూవీ. కానీ థియేటర్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. కేరళ సీఎం సీకే జోసఫ్ ను కామనర్ అనే ఓ రౌడీ కిడ్నాప్ చేస్తాడు.
{{/usCountry}}ఈ కిడ్నాప్ తో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారుతుంది. ఆ కామనర్ ను పట్టుకునేందుకు నోబుల్ అనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. మరి సీఎంను కిడ్నాప్ చేసింది ఎవరు? దీనికి కారణం ఏంటీ? అన్నది భా భా బా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.