...
...
Next Story

Tiger Shroff: యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు- వీడియో వైరల్- ముగ్గురికి గాయాలు- సల్మాన్ ఖాన్, రోహిత్ తర్వాత!

Firing On Tiger Shroff In Juhu: ముంబైలోని జూహు ప్రాంతంలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు దారుణంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో టైగర్ ష్రాఫ్‌తో పాటు ఆయన డ్రైవర్, ఓ ఆటో డ్రైవర్ గాయపడ్డారు. ఈ సంఘటనతో ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Published on: Oct 18, 2026, 20:34:36 IST
Advertisement

Firing On Tiger Shroff In Juhu: బాలీవుడ్ యంగ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో సంచలన రీతిలో కాల్పులు జరిగాయి. ముంబై జూహు ప్రాంతంలోని పుష్ప పార్క్ వద్ద బైక్‌పై వచ్చిన ముగ్గురు అజ్ఞాత దుండగులు అకస్మాత్తుగా టైగర్ ష్రాఫ్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు- వీడియో వైరల్- ముగ్గురికి గాయాలు- సల్మాన్ ఖాన్, రోహిత్ తర్వాత!
యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు- వీడియో వైరల్- ముగ్గురికి గాయాలు- సల్మాన్ ఖాన్, రోహిత్ తర్వాత!

ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్, ఆయన కారు డ్రైవర్, సమీపంలో ఉన్న ఒక ఆటో డ్రైవర్ గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

అసలేం జరిగింది?

జూహు పరిధిలో సాధారణంగా ప్రయాణిస్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. దాడికి గల నిర్దిష్ట కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

"నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరగడం అత్యంత దిగ్భ్రాంతికరం. అసలు ముంబైలో ఏం జరుగుతోంది? బాబా సిద్దిఖీ హత్య, సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు, అనేకమంది నటులు, నిర్మాతలకు బెదిరింపులు.. నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి" అని సచిన్ సావంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైందని, గతంలో బీహార్‌ను ఉదాహరణగా చెప్పేవారని, కానీ ఇప్పుడు అంతకంటే దారుణమైన వాతావరణం ముంబైలో నెలకొందని విమర్శించారు.

ముంబై సినీ పరిశ్రమలో వరుస కాల్పుల సంస్కృతి

ముంబైలో ప్రముఖ సినీ నటులు, దర్శకులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్ది నెలలుగా వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు ఇండస్ట్రీని భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

సల్మాన్ పై 5 రౌండ్ల కాల్పులు

ఏప్రిల్ 2024లో బాంద్రాలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు 5 రౌండ్లు కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత వహించగా, పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

రోహిత్ శెట్టిపై

ఫిబ్రవరి 2026లో జూహులోనే ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల కూడా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ వ్యవహారంలో పోలీసులు పలువురు షూటర్లను అదుపులోకి తీసుకున్నారు.

జనవరి 2026లో ఓషివారా ప్రాంతంలో జరిగిన కాల్పుల వ్యవహారంతో సంబంధం ఉన్నందున నటుడు, రివ్యూయర్ కమాల్ ఆర్ ఖాన్ (KRK) ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

తీవ్ర ఒత్తిడిలో ముంబై పోలీసులు

వరుసగా సెలబ్రిటీలపైనే దాడులు జరుగుతుండటంతో ముంబై పోలీసు వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. టైగర్ ష్రాఫ్‌పై దాడి వెనుక ఏవైనా ముఠా ముఠాల హస్తం ఉందా లేక వ్యక్తిగత కక్షలు కారణమా అనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks