ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు- 9 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉంటే అందులో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, కామెడీ, లవ్, క్రైమ్ థ్రిల్లర్ వంటి అన్ని జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, బోల్డ్ రొమాంటిక్, కామెడీ, లవ్ డ్రామా వంటి వివిధ రకాల జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
ది గుడ్ డాక్టర్ (ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
లవ్ ఫ్రమ్ 9 టు 5 (మెక్సికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జనవరి 1
మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్ (బ్రెజిలియన్ రియాలిటీ రొమాంటిక్ డేటింగ్ డ్యాక్యుమెంటరీ షో)- జనవరి 1
రన్ అవే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సూపర్ నోవా (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సినిమా)- డిసెంబర్ 29
సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 2
ఫాలో మై వాయిస్ (స్పానిష్ టీన్ రొమాంటిక్ బోల్డ్ డ్రామా చిత్రం)- జనవరి 2
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
మౌగ్లీ (తెలుగు రొమాంటిక్ ఫారెస్ట్ లవ్ స్టోరీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 1
ఇతిరి నేరమ్ (మలయాళ కన్వర్జేషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జనవరి 1
ఓటీటీలోకి ఇవాళ 12 సినిమాలు
ఇలా ఇవాళ (జనవరి 1) ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 31న విదేశాల్లో ఓటీటీ రిలీజ్ కాగా నేడు ఇండియాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
స్పెషల్‌గా 9-ఇంట్రెస్టింగ్‌గా 4
నేడు ఓటీటీ రిలీజ్ అయిన 12 సినిమాల్లో స్ట్రేంజర్ థింగ్స్ 5, మోగ్లీ, ఎల్‌బీడబ్ల్యూ, లవ్ ఫ్రమ్ 9 టు 5, ఇతిరి నేరమ్, లవ్ ఫ్రమ్ 9 టు 5, రన్ అవే, ది గుడ్ డాక్టర్, ఫాలో మై వాయిస్‌తో కలిపి 9 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


