OTT Web Series: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ అదిరిపోయే వినోదం అందించడానికి రెండు సరికొత్త వెబ్ సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేశాయి. వైవా హర్షా నవ్వులు పూయించేందుకు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రూపంలో వస్తే, సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారి కోసం మలయాళ సిరీస్ 'ఐస్' (Eyes) సిద్ధమైంది. ఈ రెండు సిరీస్‌ల పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడున్నాయి.
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

కామెడీ, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థలైన ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ ఏంటంటే?
సమాజం, కుటుంబం నుంచి పెళ్లి చేసుకోమని తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే తేజ అనే మధ్య తరగతి యువకుడి కథ ఇది. చూసే ప్రతి సంబంధం తప్పిపోతూ చివరకు అతను జాయిన్ అయిన సాఫ్ట్‌వేర్ కంపెనీ బాస్ మధుతోనే పెళ్లి సంబంధం కుదురుతుంది.
పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీరు ఆరు నెలల పాటు ఒకే ఇంట్లో కలిసి నివసించాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే ఆఫీస్ డ్రామా, రిలేషన్‌షిప్ గొడవలు ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులను పంచుతాయి.
6 ఎపిసోడ్లు
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాల నిడివితో సాగుతుంది. ఈ సిరీస్ లో హర్ష చెముడు, ఐశ్వర్య హొలక్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. హైపర్ ఆది, జీవన్ కుమార్, రూప శ్రావ్య, వాసు ఇంటూరి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బాబు దేగల ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
ఐస్
సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారి కోసం మలయాళంలో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఐస్’ బెస్ట్ ఆప్షన్. ఈ సిరీస్ అక్టోబర్ 8 సాయంత్రం నుంచే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఇదే
{{/usCountry}}సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్స్ చూడాలనుకునే వారి కోసం మలయాళంలో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘ఐస్’ బెస్ట్ ఆప్షన్. ఈ సిరీస్ అక్టోబర్ 8 సాయంత్రం నుంచే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఇదే
{{/usCountry}}సమాజంలో మహిళలపై జరుగుతున్న స్టాకింగ్ (వేధించడం), సీరియల్ హత్యల చుట్టూ ఈ వెబ్ సిరీస్ కథ తిరుగుతుంది. టీనా సెబాస్టియన్ అనే పోలీస్ ఆఫీసర్ ఈ కేసులను విచారిస్తుంటుంది. స్టాకర్స్ మానసిక స్థితిని అర్థం చేసుకుని, తదుపరి నేరాలను అడ్డుకోవడానికి పోలీసులతో ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ బృందం చేతులు కలుపుతుంది. స్టాకర్స్ ఎలాంటి ఎమోషనల్ మైండ్ గేమ్స్ ఆడతారనేది చాలా ఉత్కంఠభరితంగా చూపించారు.
ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో ఒక సీజన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఐస్ వెబ్ సిరీస్ లో జాతీయ అవార్డు గ్రహీత కని కుసృతి ప్రధాన పాత్రలో నటించగా.. శృతి రామచంద్రన్, నిఖిలా విమల్, సానియా ఇయ్యప్పన్, దేవ్ మోహన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. 'ఉయరే' ఫేమ్ మను అశోకన్ దీనికి దర్శకత్వం వహించారు.
ఒకవైపు హర్ష, హైపర్ ఆదిల మార్క్ కామెడీతో నవ్వుకోవడానికి, మరోవైపు ఉత్కంఠ రేపే మిస్టరీని ఛేదించే క్రైమ్ థ్రిల్లర్ అనుభూతిని పొందడానికి ఈ వీకెండ్‌కు ఈ రెండు సిరీస్‌లు ఓటీటీ లవర్స్‌కు బెస్ట్ ఛాయిస్.