OTT Today: శుక్రవారం అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కళకళలాడుతుంటాయి. ఈ రోజు (మే 1) కూడా ఆ సందడి ఉంది. థియేటర్లో కొత్త సినిమాలు రిలీజ్ కాగా.. ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ డెబ్యూ చేసేశాయి. ఇందులో ఈ నాలుగు సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. అవే.. రాకాస, బైకర్, ది కేరళ స్టోరీ 2, ఆడు 3.
రెండు ఓటీటీల్లో

శుక్రవారం ఓటీటీలోకి చాలానే సినిమాలు వచ్చాయి. ఇందులో రాకాస, బైకర్, ది కేరళ స్టోరీ 2, ఆడు 3 మాత్రం స్పెషల్ గా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు సినిమాలైన రాకాస, బైకర్ ఏమో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాయి. హిందీ మూవీ ది కేరళ స్టోరీ 2, మలయాళ చిత్రం ఆడు 3 ఏమో జీ5 ఓటీటీలో అడుగుపెట్టాయి. ది కేరళ స్టోరీ 2, ఆడు 3 కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
బ్లాక్ బస్టర్
తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘రాకాస’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
స్పోర్ట్స్ డ్రామా
శర్వానంద్ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా బైకర్ కూడా ఓటీటీ డెబ్యూ చేసింది. ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీగా ఇది థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ బైకర్ చివరకు మంచి ఫలితాన్నే ఖాతాలో వేసుకుంది. ఇందులో శర్వానంద్ తో పాటు మాళవిక నాయర్, సీనియర్ హీరో రాజశేఖర్ తదితరులు నటించారు.
ది కేరళ స్టోరీ 2
{{/usCountry}}శర్వానంద్ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా బైకర్ కూడా ఓటీటీ డెబ్యూ చేసింది. ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీగా ఇది థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ బైకర్ చివరకు మంచి ఫలితాన్నే ఖాతాలో వేసుకుంది. ఇందులో శర్వానంద్ తో పాటు మాళవిక నాయర్, సీనియర్ హీరో రాజశేఖర్ తదితరులు నటించారు.
ది కేరళ స్టోరీ 2
{{/usCountry}}థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ది కేరళ స్టోరీ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడి లాంటి విషయాలు చుట్టూ సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళం ప్రతిష్ఠను దిగజార్చేలా ఈ మూవీ ఉందనే విమర్శలు వచ్చాయి.
ఆడు 3
మలయాళం బ్లాక్ బస్టర్ ఫాంటసీ కామెడీ మూవీ ఆడు 3. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ చిత్రం ఈ రోజు డిజిటల్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చింది. సూపర్ హిట్ ‘ఆడు’ సిరీస్ లో వచ్చిన మూడో చిత్రం ఇది. ఇందులో జయసూర్య, వినాయకన్ కీలక పాత్రలు పోషించారు.