...
...
Next Story

OTT Releases: ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు.. కుడి వైపు గుండెతో తెలుగు థ్రిల్లర్.. పులి వేషంతో కన్నడ థ్రిల్లర్!

OTT Releases: ఓటీటీ లవర్స్ కు అదిరే థ్రిల్ అందించేందుకు రెండు థ్రిల్లర్ సినిమాలు ఇవాళ ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో ఒకటేమో తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ ‘కికు చిరంజీవి’ కాగా.. మరొకటి కన్నడ థ్రిల్లర్ ‘మార్‌నమి’. వీటి స్టోరీ, ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదు అనే విషయాలు చూసేయండి.

Published on: Nov 18, 2026, 13:00:54 IST
Advertisement

OTT Releases: టాలీవుడ్ ప్రేక్షకులను సరికొత్త పాయింట్ తో థ్రిల్ చేయడానికి 'కికు చిరంజీవి' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన ఈ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ కు శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది.

జియోహాట్‌స్టార్ ఓటీటీలో

ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు.. కుడి వైపు గుండెతో తెలుగు థ్రిల్లర్.. పులి వేషంతో కన్నడ థ్రిల్లర్!
ఇవాళ ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు.. కుడి వైపు గుండెతో తెలుగు థ్రిల్లర్.. పులి వేషంతో కన్నడ థ్రిల్లర్!

లేటెస్ట్ తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ ‘కికు చిరంజీవి’ మూవీ ఇవాళ (నవంబర్ 18) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ మూవీని అందుబాటులోకి తెచ్చారు.

గుండె కుడివైపు ఉంటే

కికు చిరంజీవి సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా మనుషులకు గుండె ఎడమవైపు ఉంటుంది. కానీ ఈ కథలో హీరో చిరుకి పుట్టుకతోనే గుండె కుడివైపు ఉంటుంది. ఈ అరుదైన సమస్యతో అతను తన జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అతన్ని అకారణంగా టార్గెట్ చేసిన అజ్ఞాత శత్రువులు ఎవరు? హీరో భార్య మానసకు తన భర్త గురించి తెలిసిన ఆ షాకింగ్ నిజం ఏంటి? అనేది ఈ కథాంశం.

తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా రాఘవ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తుంది.

ప్రైమ్‌లో కన్నడ ఫ్యామిలీ థ్రిల్లర్

మంగళూరు తీరప్రాంతం, అక్కడి సంప్రదాయాలకు అద్దం పట్టేలా మార్‌నమి సినిమాను తెరకెక్కించారు. తీరప్రాంతంలో ప్రసిద్ధి చెందిన 'హులివేషం' (పులి వేషం) డాన్స్ సంప్రదాయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సంప్రదాయమే హీరో చేతు జీవితాన్ని ఎలా మార్చింది? అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఒక వ్యక్తి తన వారసత్వాన్ని కాపాడుకోవడానికి పడే తపన, అందులో అతను ఎదుర్కొన్న హింస, ప్రేమ, ట్రాజెడీ ఎలిమెంట్స్ ను ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks