OTT Tamil: శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల రిలీజ్ లతో ఓటీటీ సందడి వేరే లెవల్ లో ఉంటుంది. ఈ రోజు కూడా చాలా చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో ఈ రెండు తమిళ రొమాంటిక్ మూవీస్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అందులో ఒకటి ‘నీ ఫర్ ఎవర్’ సినిమా కాగా.. మరొకటి ‘హ్యాపీ రాజ్’ ఫిల్మ్. వీటి ఓటీటీ రిలీజ్ పై ఓ లుక్కేయండి.
నీ ఫర్ ఎవర్ ఓటీటీ

డేటింగ్ యాప్ తో పరిచయమైన జంట మధ్య సాగే రొమాంటిక్ లవ్ జర్నీ చుట్టూ అల్లుకున్న కథనే ‘నీ ఫర్ ఎవర్’ మూవీ. ఈ సినిమా ఇవాళ (ఏప్రిల్ 24) ఓటీటీలో అడుగుపెట్టింది. శుక్రవారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
నీ ఫర్ ఎవర్ స్టోరీ
నీ ఫర్ ఎవర్ సినిమా డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ జంటకు ఎలాంటి పరిస్థితి తలెత్తిందనే కథతో నీ ఫర్ ఎవర్ మూవీని తీర్చదిద్దారు.
అజయ్ (సుదర్శన్ గోవింద్), మాతి (అర్చనా రవి) ఓ డేటింగ్ యాప్ ద్వారా కలుసుకుంటారు. కానీ వాళ్ల రియల్ క్యారెక్టర్లను, లైఫ్ ను దాచి ఉంచి వీళ్లు ఫేక్ రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. వీళ్ల ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఏర్పడతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల మధ్య నిజంగానే లవ్ ఏర్పడిందా? అన్నది నీ ఫర్ ఎవర్ మూవీలో చూడాల్సిందే.
హ్యాపీ రాజ్ ఓటీటీ
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగానూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అతను లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘హ్యాపీ రాజ్’. ఈ సినిమా కూడా ఇవాళ డిజిటల్ డెబ్యూ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
హ్యాపీ రాజ్ స్టోరీ
{{/usCountry}}మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగానూ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అతను లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ రొమాంటిక్ మూవీ ‘హ్యాపీ రాజ్’. ఈ సినిమా కూడా ఇవాళ డిజిటల్ డెబ్యూ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో సీనియర్ హీరో అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చాడు.
హ్యాపీ రాజ్ స్టోరీ
{{/usCountry}}ఆనంద రాజ్ అలియాస్ హ్యాపీ రాజ్ (జీవీ ప్రకాష్) తన తంద్డి కారణంగా ఇబ్బందులు పడుతుంటాడు. బెంగళూరులో అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్తాడు. అక్కడ కావ్య (శ్రీ గౌరీ ప్రియ)తో ప్రేమలో పడతాడు. మరి వీళ్ల పెళ్లి కథ కంచికి చేరిందా? హ్యాపీ రాజ్, తండ్రి మధ్య ఎమెషన్ ఎలాంటిది? అనేది హ్యాపీ రాజ్ మిగతా స్టోరీ.