OTT Telugu: మ్యాప్‌తో నిధి వేట.. అదిరే ట్విస్ట్.. నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్
ఈ రోజు ఓటీటీలోకి ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెలుగు సినిమా వచ్చేసింది. ఆశకు, అత్యాశకు ముడిపెడుతూ వచ్చిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంది. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రొడ్యూసర్.
సండే స్పెషల్ గా ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇవాళ (ఫిబ్రవరి 8) డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే ‘గోల్డ్ అండ్ గీత’. డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ విభిన్నమైన స్టోరీ లైన్ ఉన్న సినిమా ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ (x/etvwin)
గోల్డ్ అండ్ గీత ఓటీటీ
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ గోల్డ్ అండ్ గీత మూవీ ఆదివారం ఓటీటీలో రిలీజైంది. ఈ చిత్రం నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా విడుదలైంది. ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా డిజిటల్ డెబ్యూ చేసింది గోల్డ్ అండ్ గీత మూవీ.
గోల్డ్ అండ్ గీత స్టోరీ
ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మానాన్న మాట వినకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటారు. పార్టీలు, పబ్ లు అంటూ జల్సాలు చేస్తుంటారు. డబ్బులు సంపాదించడం చేతకానివాళ్లకు సరదాలు తీర్చుకునే హక్కు లేదని పేరేంట్స్ కోప్పడతారు.
డబ్బు సంపాదించాలని
15 రోజుల్లో డబ్బు సంపాదిస్తామని ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ల పేరెంట్స్ తో ఛాలెంజ్ చేస్తారు. మరోవైపు వీళ్లు ఓ పోలీస్ కేసులో ఇరుక్కుంటారు. ఆ సమయంలోనే ఓ నిధి మ్యాప్ దొరుకుతుంది. ఆ నిధి విలువ కొన్ని కోట్ల రూపాయాలు అని తెలుస్తుంది. దీంతో తమ లవర్స్ ను వెంటబెట్టుకుని నిధి కోసం ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అడవిలోకి వెళ్తారు.
నిధి కోసం వెళ్లిన ఈ నలుగురు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాళ్లకు నిధి దొరికిందా? చివరకు తమ లవర్స్ నే ఎందుకు చంపాలనుకున్నారు? ఈ స్టోరీకి కృష్ణుడి గీత సారాంశానికి సంబంధం ఏంటీ? అన్నది గోల్డ్ అండ్ గీత మూవీలో చూడాల్సిందే.
ప్రొడ్యూసర్ రాఘవేంద్ర రావు
దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ గోల్డ్ అండ్ గీత సినిమాకు ప్రొడ్యూసర్. ఆర్కే టెలిషో బ్యానర్ కింద దీన్ని నిర్మించారు. దీనికి గంగనమోని శేఖర్ డైెరెక్టర్. గోల్డ్ అండ్ గీత సినిమాలో అజయ్ కథుర్వార్, ఆదిత్య, దక్షి గుత్తికొండ, వర్షు పాసం, రమ్య పొందూరి తదితరులు నటించారు.
ఈటీవీ విన్ కథాసుధ
పాపులర్ ఓటీటీ ప్లాట్ పామ్ ఈటీవీ విన్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సండే కథాసుధలో భాగంగా ఓ చిన్న సినిమాను రిలీజ్ చేస్తుంది. ఈ సండే గోల్డ్ అండ్ గీతను తీసుకొచ్చింది. ఈ మూవీ 32 నిమిషాల్లో అయిపోతుంది. సండే రోజు తక్కువ టైమ్ లోనే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకున్నవాళ్లకు గోల్డ్ అండ్ గీత మంచి ఆప్షన్.