...
...
Next Story

Gundu Sudarshan: తన కన్నీటితో ఈ పంట పండించాడు, చాలా సంఘర్షణ పడ్డారు: సీనియర్ నటుడు గుండు సుదర్శన్ కామెంట్స్

Gundu Sudarshan Comments On Mr Work From Home Movie: టాలీవుడ్ సీనియర్ నటుడు గుండు సుదర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మే 15న అంటే ఇవాళ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు గుండు సుదర్శన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: May 15, 2026, 12:51:04 IST
Advertisement

Gundu Sudarshan About Mr Work From Home Movie And Agriculture: తెలుగులో సీనియర్ నటుడుగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు గుండు సుదర్శన్. ఎన్నో చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో అలరించిన గుండు సుదర్శన్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.

చాలా గ్రాండ్‌గా రిలీజ్

తన కన్నీటితో ఈ పంట పండించాడు, చాలా సంఘర్షణ పడ్డారు: సీనియర్ నటుడు గుండు సుదర్శన్ కామెంట్స్
తన కన్నీటితో ఈ పంట పండించాడు, చాలా సంఘర్షణ పడ్డారు: సీనియర్ నటుడు గుండు సుదర్శన్ కామెంట్స్

ఈ సినిమాలో హీరో త్రిగుణ్, హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ జోడీగా నటించారు. మధుదీప్ చెలికాని కథ, దర్శకత్వం వహించిన ఈ సినిమాను లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. ఇవాళ (మే 15) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ విడుదల అయింది.

మిస్టర్ వర్క్ ఫ్రమ్ పైసా వసూల్ ట్రైలర్ లాంచ్

అయితే, రిలీజ్‌కు రెండు రోజుల ముందు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పైసా వసూల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మధుదీప్, వ్యవసాయం గురించి సీనియర్ నటుడు గుండు సుదర్శన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది

గుండు సుదర్శన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమాతో నాకు చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది. ఇది అగ్రికల్చర్‌కు సంబంధించిన సబ్జెక్ట్. తన కన్నీటితో ఈ పంట పండించాడు దర్శకుడు. ఇలాంటి మంచి సినిమా తీయడానికి చాలా సంఘర్షణ పడ్డారు" అని చెప్పారు.

చాలా మంచి ఫీల్‌గుడ్ మూవీ

ఇదే ఈవెంట్‌లో డైరెక్టర్ మధుదీప్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. జీవితంలో ఏం చేసినా పెద్దవాళ్లను గౌరవించాలని చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు. ఆయన ఎందుకు ఆ మాట చెప్పారో ఈరోజు నాకు అర్థమైంది. మా నాన్న చెప్పిన మాట ఈరోజు నిజమైంది" అని అన్నారు.

ఓపెన్ మైండ్‌తో చూస్తే నచ్చుతుంది

"రాందాస్ గారు లేకపోతే ఈ సినిమా బయటకు వచ్చి ఇంతమందిని అలరించేది కాదు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. సినిమా ఓపెన్ మైండ్‌తో చూస్తే కచ్చితంగా మీకు నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఇది సమ్మర్ సినిమా. అందరూ ఎంజాయ్ చేసే సినిమా" అని దర్శకుడు మధుదీప్ తెలిపారు.

మనసుల్లో నిలిచిపోతుంది

"ఈ సినిమాను ఆదరిస్తే ఒక మంచి సినిమాను సమాజానికి అందించిన వాళ్లం అవుతాం. ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా మీ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 15న మీరందరూ థియేటర్స్‌లో చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ డైరెక్టర్ మధుదీప్ చెలికాని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe