Rag Mayur: దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం గొప్ప గుర్తింపు, బుర్ర‌క‌థ క‌ళాకారుడిగా కనిపిస్తా: రాగ్ మయూర్

Rag Mayur About His Filmography: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. సినిమా బండి మూవీతో సక్సెస్ అందుకున్న రాగ్ మయూర్ అనంతరం విభిన్న పాత్రలతో మెప్పించాడు. సినిమా బండి మూవీ విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాగ్ మయూర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.

Published on: May 17, 2026, 18:02:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rag Mayur About His Filmography: ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రతిభావంతులైన నటుల్లో రాగ్ మ‌యూర్‌ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాగ్ మయూర్.. తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సినిమా బండి’ ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.

దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం గొప్ప గుర్తింపు, బుర్ర‌క‌థ క‌ళాకారుడిగా కనిపిస్తా: రాగ్ మయూర్
దర్శకులు నాకోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం గొప్ప గుర్తింపు, బుర్ర‌క‌థ క‌ళాకారుడిగా కనిపిస్తా: రాగ్ మయూర్

అంతకంటే మంచి డెబ్యూని

ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెల‌కు రాగ్ మయూర్ కృతజ్ఞతలు తెలిపారు. “న‌టుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మ‌రిడేశ్‌ బాబు లాంటి అద్భుతమైన పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే మంచి డెబ్యూని నేను కోరుకోలేను. సినిమా బండి సినిమా న‌టుడిగా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది” అని రాగ్ మ‌యూర్ తెలిపారు.

ఈ సినిమా విజయం తన కెరీర్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆయన ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. రాగ్ మ‌యూర్‌కు సినిమా బండి మూవీ మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ త‌ర్వాత ఆయ‌న వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌, కీడా కోలా, గాంధీతాతా చెట్టు వంటి చిత్రాల్లో న‌టించారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఈ చిత్రాలు రాగ్ మయూర్‌ని యువ‌త‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర చేశాయి. ప్ర‌ముఖ హిందీ ఓటీటీ వెబ్ సిరీస్ ‘పంచాయ‌త్‌’కు రీమేక్‌గా వ‌చ్చిన ‘సివ‌రాప‌ల్లి’ న‌టుడిగా మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు ఆయ‌న ఓ ప్రాజెక్ట్‌ను మోయ‌గ‌ల‌ర‌ని నిరూపించింది. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన సివరాపల్లి మంచి సక్సెస్ అందుకుంది.

‘‘సివరాపల్లి’ సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాకు మరింత ఆత్మ విశ్వాసం వ‌చ్చింది. చాలా మంది ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను రాశామ‌ని చెప్పారు. ద‌ర్శ‌కులు నాకోసం ప్ర‌త్యేకంగా పాత్ర‌లు రాయ‌టం అనేది న‌టుడిగా నాకు గొప్ప గుర్తింపు. నేను థియేట‌ర్ ఆర్టిస్ట్ కావ‌టంతో న‌ట‌న‌లో విభిన్న కోణాల‌ను అన్వేషించే అవ‌కాశం ద‌క్కింది. అది నా న‌ట‌న‌ను మ‌రింత మెరుగు ప‌రిచింది’’ అని రాగ్ మ‌యూర్ తెలిపారు.

సమంత శుభంలో

గతేడాది సమంత రూపొందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘శుభం’లో రాగ్ మయూర్ అతిథి పాత్రలో నటించారు. “అది చిన్న క్యామియో పాత్రే అయినా, ఓ బ్లాక్‌బస్టర్ సినిమాలో భాగమవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన సమంత గారికి కృతజ్ఞతలు” అని రాగ్ మయూర్ తెలిపారు.

ఇక టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ప‌ర‌దా’ చిత్రంలో రాజేష్ అనే పాత్ర‌లో రాగ్ మ‌యూర్ న‌టించి ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిత్ర మండ‌లి’లోనూ ఆయ‌న చెప్పిన ఇంగ్లీష్ వ‌న్ లైన‌ర్స్ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

బుర్ర‌క‌థ క‌ళాకారుడిగా

డైరెక్ట‌ర్ గౌరి నాయుడు జ‌మ్ము తెర‌కెక్కిస్తోన్న ‘గ‌రివిడి లక్ష్మి’లో రాగ్ మ‌యూర్ బుర్ర‌క‌థ క‌ళాకారుడిగా కనిపించనున్నారు. “ఇది చాలా ఎక్సైటింగ్‌తో పాటు ఛాలెంజింగ్ పాత్ర కూడా. ఈ పాత్ర కోసం ఎంతో ప్రిపేర్ అయ్యి న‌టించాను” అని రాగ్ మయూర్ తెలిపారు.

తన ఫిల్మోగ్రఫీపై గర్వంగా ఉందని చెప్పిన రాగ్ మయూర్, “నా కెరీర్ ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి దర్శకులు, టెక్నీషియన్స్‌తో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఎమోషన్స్, రియలిస్టిక్ కథనాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించాలని ఎప్పటినుంచో కోరుకున్నాను” అని అన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More