డ్రగ్స్ కలకలం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ పబ్ లో డ్రగ్ టెస్టు నిర్వహిస్తే మొత్తం 8 మందికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. ఇదే పార్టీకి టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా అటెండ్ అయింది. డ్రగ్ టెస్టు రిజల్ట్ పై ఆమె వీడియో రిలీజ్ చేసింది.
హేమ వీడియో

టాలీవుడ్ సీనియర్ నటి హేమ అంటే తెలియని వాళ్లు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఎన్నో సినిమాలు చేసింది. కామెడీ పండించింది. దిగ్గజ కమెడియన్ల సరసన యాక్ట్ చేసింది. తాజాగా ఆమె తన డ్రగ్ టెస్ట్ రిజల్ట్ నెగెటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది.
తప్పు చేయదని
‘‘ఇవాళ నేను పబ్ కు వచ్చా. అక్కడ నా యూరిన్ శాంపిల్ తీశారు. నా డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. కనిపించిందా? నేను మరో వీడియో పోస్టు చేస్తా. మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు. జెన్యూన్ గా ఉంటుంది. ముక్కుసూటిగా ఉంటుంది. లవ్యూ ఆల్’’ అని ఆ వీడియోలో తన డ్రగ్ టెస్టు రిజల్ట్ చూపించింది.
8 మందికి
కొండాపూర్ లోని ఓ పబ్ లో పార్టీ చేసుకున్న వాళ్లలో డ్రగ్స్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఇందులో మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఆరుగురికి గంజాయి పాజిటివ్, ఇద్దరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఇదే పార్టీలో నటి హేమ కూడా పాల్గొంది. కానీ తనకు నెగెటివ్ వచ్చిందంటూ ఆమె వీడియో పోస్టు చేసింది.
ఆ డ్రగ్ కేసు
{{/usCountry}}కొండాపూర్ లోని ఓ పబ్ లో పార్టీ చేసుకున్న వాళ్లలో డ్రగ్స్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఇందులో మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఆరుగురికి గంజాయి పాజిటివ్, ఇద్దరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఇదే పార్టీలో నటి హేమ కూడా పాల్గొంది. కానీ తనకు నెగెటివ్ వచ్చిందంటూ ఆమె వీడియో పోస్టు చేసింది.
ఆ డ్రగ్ కేసు
{{/usCountry}}గతంలో బెంగళూరులో రేవ్ పార్టీ సందర్భంగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ వెంటనే లైవ్ వీడియో రిలీజ్ చేసిన ఆమె డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొంది. కానీ ఆ కేసులో హేమ పేరును కూడా విచారణ నిర్వహించారు. అయితే హేమకు క్లీన్ చీట్ ఇచ్చారు.
అది నరకం
డ్రగ్స్ కేసు సమయంలో నరకం అనుభవించానని ఓ సందర్భంగా హేమ పేర్కొంది. ‘‘ఆ సమయంలో నరకం అనుభవించా. దాని గురించి మాటల్లో చెప్పలేను. నా చుట్టూ జరుగుతున్న ప్రచారం చూసి కుంగిపోయా. ఒక దశలో చనిపోవాలని అనిపించింది. ఏ తప్పు చేయకున్నా నిందలు పడాల్సి వచ్చింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నిర్దోషిగా బయటపడ్డా’’ అని అప్పుడు హేమ తెలిపింది.