...
...
Next Story

Manasa: అనుటెక్స్ సారీ షో రూమ్ ప్రారంభించిన హీరోయిన్ మానస వారణాసి- ఎగబడిన ఫ్యాన్స్- పాకెట్ ఫ్రెండ్లీ సిద్ధాంతంతో ధరలు!

Manasa Varanasi Opened Anutex Shopping Mall New Showroom: టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ మానస వారణాసి ఆర్సీ పురంలో సందడి చేసింది. సిల్క్ సారీ షాపింగ్ మాల్ అనుటెక్స్ కొత్త షోరూమ్‌ను మానస వారణాసి తాజాగా ప్రారంభించింది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Published on: Apr 24, 2026, 20:54:54 IST
Advertisement

Manasa Varanasi Opened Anutex Shopping Mall New Showroom: కుటుంబ ఫ్యాషన్‌లో విశ్వసనీయ బ్రాండ్‌గా పేరుగాంచిన సిల్క్ సారీస్ షాపింగ్ మాల్ అనుటెక్స్ తన విస్తరణలో భాగంగా ఆర్సీ పురంలో నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ మానస వారణాసి హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

ఎగబడిన ఫ్యాన్స్

అనుటెక్స్ సారీ షో రూమ్ ప్రారంభించిన హీరోయిన్ మానస వారణాసి- ఎగబడిన ఫ్యాన్స్- పాకెట్ ఫ్రెండ్లీ సిద్ధాంతంతో ధరలు!
అనుటెక్స్ సారీ షో రూమ్ ప్రారంభించిన హీరోయిన్ మానస వారణాసి- ఎగబడిన ఫ్యాన్స్- పాకెట్ ఫ్రెండ్లీ సిద్ధాంతంతో ధరలు!

హీరోయిన్ మానస వారణాసి రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే, మానస వారణాసితో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్, ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజలు ఉత్సాహం చూపించారు.

అందుబాటు ధరలో

ఇక అనుటెక్స్ కొత్త బ్రాంచ్‌ ద్వారా సాంప్రదాయం, నాణ్యత, అందుబాటు ధరల సమ్మేళనాన్ని మరో ప్రాంతానికి చేరువ చేయనుందని నిర్వాహకులు చెబుతున్నారు. 1970 నుంచి విశ్వాసానికి చిరునామాగా అను‌టెక్స్‌ నిలుస్తుందని, తమ ప్రయాణం ఐదు దశాబ్దాలకుపైగా వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుందని వారు చెప్పారు. నాణ్యత, నమ్మకం అనే విలువలపై నిర్మితమైనది అను‌టెక్స్‌పై ఉంచిన నమ్మకం అని, ఈ బ్రాండ్‌ను స్థానిక రిటైల్‌ రంగంలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలబెట్టిందని అన్నారు.

అనుటెక్స్ బ్రాంచ్ ఏరియాలు

ఆర్సీ పురం బ్రాంచ్‌తో పాటు, అను‌టెక్స్‌ ఇప్పటికే కోతపేట్‌, అల్వాల్‌, మల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఏఎస్‌రావ్‌ నగర్‌, సుచిత్ర వంటి ప్రాంతాల్లో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో కొత్త షోరూమ్‌లను ప్రారంభించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కుటుంబం మొత్తం కోసం ఒకే చోట షాపింగ్‌

అను‌టెక్స్‌ షోరూమ్‌ కుటుంబ సభ్యులందరికీ అనువైన ఒకే చోట షాపింగ్‌ గమ్యస్థానంగా రూపుదిద్దుకుంది. పండుగల కోసం ప్రత్యేక కలెక్షన్స్‌, రోజువారీ దుస్తులు, సంప్రదాయ వేషధారణ అన్ని విభాగాల్లో విస్తృత ఎంపికలను అందిస్తోంది. “పాకెట్‌ ఫ్రెండ్లీ” సిద్ధాంతంతో, నాణ్యతను తగ్గించకుండా సరసమైన ధరల్లో ఉత్తమ ఉత్పత్తులను అందించడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత.

ప్రారంభోత్సవ ఆఫర్లు.. కస్టమర్లకు కృతజ్ఞతలు

అను‌టెక్స్‌ను స్థాపించిన రామకృష్ణ స్ఫూర్తితో, ప్రస్తుతం శ్రీనివాస్‌ నాయకత్వంలో సంస్థ ముందుకు సాగుతోంది. ఆయన కుమారుడు రామ్‌ ఈ వారసత్వాన్ని భవిష్యత్తులో మరింతగా విస్తరించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే, “అ అంటే Anutex.. ఆ అంటే Aadaa!. ఆదాకు ఆఫర్లకు ఆధార్ కార్డ్‌లాంటి అడ్రెస్ .. Anutex!” అని షాపింగ్ యాజమాన్యం చెబుతోంది.

కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ స్ట్రీమింగ్

ఇదిలా ఉంటే, అశోక్ గల్లా హీరోగా చేసిన దేవకీ నందన వాసుదేవ సినిమాతో మానస వారణాసి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఇటీవల సంతోష్ శోభన్ హీరోగా చేసిన కపుల్ ఫ్రెండ్లీ మూవీతో మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe