టాలీవుడ్‌లో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ కల్యాణ్ ఆర్ట్స్- కథే హీరో సిద్ధాంతంతో ప్రారంభం- నిర్మాత కల్యాణ్ కామెంట్స్

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ అవకాశాలు కల్పించేందుకు టాలీవుడ్‌లో సరికొత్త బ్యానర్ ఉద్భవించింది. అదే కల్యాణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్. ఈ బ్యానర్‌ను ప్రారంభించిన కల్యాణ్ ప్రతిభ ఉన్న వారికి సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేశామని చెప్పారు.

Published on: Jan 5, 2026, 07:11:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించారు నిర్మాత కల్యాణ్. వినూత్న కథలు, కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ కొత్త తరహా సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగుతోంది.

టాలీవుడ్‌లో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ కల్యాణ్ ఆర్ట్స్- కథే హీరో సిద్ధాంతంతో ప్రారంభం- నిర్మాత కల్యాణ్ కామెంట్స్
టాలీవుడ్‌లో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ కల్యాణ్ ఆర్ట్స్- కథే హీరో సిద్ధాంతంతో ప్రారంభం- నిర్మాత కల్యాణ్ కామెంట్స్

అవకాశాలు లభించడం కష్టం

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవాళ్లకు అవకాశాలు లభించడం కష్టంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రతిభ ఉన్న వారికి సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను స్థాపించినట్లు ప్రొడ్యూసర్ కల్యాణ్ తెలిపారు.

ఆలోచింపజేసే, అలరించే సినిమాలు

"కథే హీరో” అన్న సిద్ధాంతంతో, వినూత్న కథలు, సమకాలీన అంశాలు, ప్రేక్షకులను ఆలోచింపజేసే, అలరించే సినిమాలను నిర్మించడమే తమ లక్ష్యం అని నిర్మాత కల్యాణ్ తెలిపారు.

సరైన వేదిక కల్పించాలనే

నిజమైన ప్రతిభకు సరైన వేదిక కల్పించాలనే బలమైన ఆలోచనతో కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆవిర్భవించిందని, కొత్త దర్శకులు, కొత్త నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశాలు ఇస్తూ, కంటెంట్‌ ఆధారిత సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఈ బ్యానర్‌ను ప్రారంభించామని నిర్మాత కల్యాణ్ అన్నారు.

క్రియేటివిటీకి పూర్తి ప్రాధాన్యత

కొత్త ఆలోచనలకు స్వేచ్ఛ, క్రియేటివిటీకి పూర్తి ప్రాధాన్యం ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలకు కూడా కల్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పెద్ద పీట వేయనుందని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఆసక్తికర కథలు ఫైనల్ దశలో ఉండగా, తొలి సినిమా వివరాలను సంక్రాంతి సందర్భంగా ప్రకటిస్తామని నిర్మాత కల్యాణ్ వెల్లడించారు.

న్యూ ప్రొడ్యూసర్ కల్యాణ్

ఆ సినిమాల రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా టాలీవుడ్ కొత్త ప్రొడ్యూసర్ కల్యాణ్ తెలియజేశారు. అవకాశాల కోసం ఎదురుచూసేవారికి కల్యాణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మంచి వేదిక కానుందని తెలుస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More