OTT Deals: ధురంధర్ 2 ఓటీటీ డీల్ రూ.150 కోట్లు.. టాప్ 8 డీల్స్ ఇవే.. ఐదు తెలుగు సినిమాలే

OTT Deals: ఓటీటీలో ఇండియన్ సినిమాలు డిజిటల్ డీల్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి వస్తున్న ధురంధర్ 2 మూవీ ఏకంగా రూ.150 కోట్ల డీల్ కుదుర్చుకోగా.. టాప్ 8 సినిమాల్లో ఐదు తెలుగు మూవీసే కావడం విశేషం.

Published on: May 15, 2026, 17:25:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Deals: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన రణవీర్ సింగ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్ 2' (Dhurandhar 2) ఇప్పుడు ఓటీటీ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి. ఇది రణవీర్ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం.

OTT Deals: ధురంధర్ 2 ఓటీటీ డీల్ రూ.150 కోట్లు.. టాప్ 8 డీల్స్ ఇవే.. ఐదు తెలుగు సినిమాలే
OTT Deals: ధురంధర్ 2 ఓటీటీ డీల్ రూ.150 కోట్లు.. టాప్ 8 డీల్స్ ఇవే.. ఐదు తెలుగు సినిమాలే

జియోహాట్‌స్టార్‌తో భారీ డీల్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 ఇండియన్ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ (JioHotstar) సంస్థ సుమారు రూ.150 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొదటి భాగం 'ధురంధర్: ది రివెంజ్' హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.85 కోట్లకు దక్కించుకోగా, ఇప్పుడు రెండో భాగానికి దాదాపు రెట్టింపు ధర లభించడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

ఇండియా, విదేశాల్లో స్ట్రీమింగ్ వివరాలు

ఈ ధురంధర్ 2 సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు ఉంది. ఇండియాలో ఈ సినిమా జియోహాట్‌స్టార్ వేదికగా జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని తాజాగా ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.

అయితే విదేశాల్లో ఉన్న ప్రేక్షకుల కోసం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమాను మే 15 నుంచి అందుబాటులోకి తెచ్చింది. అక్కడ 'అన్‌కట్, రా' (Uncut and Raw) వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇండియన్ సినిమాల టాప్ ఓటీటీ డీల్స్

ప్రస్తుతం భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన టాప్ డిజిటల్ రైట్స్ జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. టాప్ 8 సినిమాల్లో ఐదు తెలుగు మూవీసే ఉండటం విశేషం. తొలి స్థానంలో కల్కి 2898 ఏడీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.375 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ఉంది. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ కలిపి జీ నెట్ వర్క్ ఏకంగా రూ.325 కోట్లు వెచ్చించింది.

కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీ మూడో స్థానంలో ఉండగా.. దీనికోసం ప్రైమ్ వీడియో రూ.320 కోట్లు ఖర్చు చేసింది. పుష్ప 2 ది రూల్ కోసం రూ.275 కోట్లు, ఆదిపురుష్ కోసం రూ.200 కోట్లు, సలార్ పార్ట్ 1 కోసం రూ.160 కోట్లు, దేవర కోసం రూ.150 కోట్లు నెట్‌ఫ్లిక్స్ ఖర్చు చేసింది. తాజాగా ధురంధర్ 2 కోసం జియోహాట్‌స్టార్ కూడా రూ.150 కోట్లు చెల్లించింది.

బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' ప్రభంజనం

మార్చి 19న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో అద్భుతమైన వసూళ్లను సాధించింది. రిపోర్ట్స్ ప్రకారం.. ఇండియాలో రూ.1,300 కోట్లకు పైగా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,800 కోట్లు వసూలు చేసింది.

ఈ భారీ వసూళ్ల వల్లే ఓటీటీ సంస్థలు కూడా ఈ సినిమా కోసం భారీగా పోటీ పడ్డాయి. రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ టేకింగ్ ఈ సినిమాను ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. జియోహాట్‌స్టార్ లో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ అనే అనౌన్స్‌మెంట్ రావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా పేరుఓటీటీ ప్లాట్‌ఫామ్డీల్ విలువ (సుమారు)
కల్కి 2898 ADనెట్‌ఫ్లిక్స్ (హిందీ) + ప్రైమ్ (సౌత్) 375 కోట్లు (మొత్తం)
RRRజీ గ్రూప్ (డిజిటల్ + శాటిలైట్) 325 కోట్లు
KGF చాప్టర్ 2అమెజాన్ ప్రైమ్ వీడియో 320 కోట్లు
పుష్ప 2: ది రూల్నెట్‌ఫ్లిక్స్ 275 కోట్లు
ఆదిపురుష్నెట్‌ఫ్లిక్స్ 200 కోట్లు
సలార్: పార్ట్ 1నెట్‌ఫ్లిక్స్ 160 కోట్లు
దేవర: పార్ట్ 1నెట్‌ఫ్లిక్స్ 150 కోట్లు
ధురంధర్ 2జియో హాట్‌స్టార్ 150 కోట్లు
  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More